సుప్రీంకోర్టు జడ్జికి ఇవ్వాల్సిన గౌరవ వందనం ఒవైసీకి..!
- సహారన్‌పూర్ పోలీసుల ప్రోటోకాల్ పొరపాటు..!
On

ఉత్తరప్రదేశ్ : ఉత్తరప్రదేశ్‌లోని సహారన్‌పూర్ సర్క్యూట్ హౌస్ వద్ద పోలీసుల ప్రోటోకాల్‌లో జరిగిన పొరపాటు చర్చనీయాంశంగా మారింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి రాక సందర్భంగా గార్డ్ ఆఫ్ ఆనర్ సమర్పించేందుకు సిద్ధమైన పోలీసులు, పొరపాటున ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి గౌరవ వందనం సమర్పించారు. పోలీసుల సెల్యూట్‌తో ఒవైసీ అక్కడ నిలబడి గౌరవ వందనాన్ని స్వీకరించారు. అయితే, సదరు న్యాయమూర్తి ఆ సమయంలో సర్క్యూట్ హౌస్‌కు రాలేదని, ఢిల్లీకి వెళ్లిపోయారని పోలీసు అధికారి వెల్లడించినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన సహారన్‌పూర్ ఎస్పీ విచారణకు ఆదేశించారు. పోలీసుల ప్రోటోకాల్ నిర్వహణలో జరిగిన ఈ పొరపాటు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Views: 22
About The Author

Tags:
Related Posts

Error on ReusableComponentWidget
Latest News
22 Nov 2026 15:44:52
తిరుపతి : శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాలలోని మెకానికల్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన అధ్యాపకులు డా. ఎన్. బాలసుబ్రహ్మణ్యం ప్రతిష్ఠాత్మకమైన ఆంధ్రప్రదేశ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్...
