చౌటుకూరు మండల కేంద్రంలో ఘనంగా పల్స్ పోలియో కార్యక్రమం.. చిన్నారులకు పోలియో చుక్కలు

చౌటుకూరు మండల కేంద్రంలో ఘనంగా పల్స్ పోలియో కార్యక్రమం.. చిన్నారులకు పోలియో చుక్కలు

చౌటకూర్ :- సంగారెడ్డి జిల్లా చౌటుకూరు మండల కేంద్రంలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లె దవాఖాన వైద్యులు డాక్టర్ వి. హరిహర దుర్గాప్రసాద్ మాట్లాడుతూ.. చిన్నారుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని గ్రామంలో రెండు రోజుల పాటు పల్స్ పోలియో కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. మొదటి రోజు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోలియో కేంద్రాల్లో చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తామని, రెండో రోజు ఆరోగ్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు వేస్తారని వివరించారు. ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు.ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వరకల రమేష్, వార్డు సభ్యులు జైపాల్ రెడ్డి, గోరుమియా, అభిలాష్, పేట గంగారం, చక్రపాణి, సిస్టర్ రాములమ్మ, ఆశా కార్యకర్తలు యాదమ్మ, సునీత, స్వరూప, అంగన్‌వాడీ టీచర్లు సత్యనీల, మరియ, అనసూయ, నాగమణి మరియు ఇతర ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు

Views: 17

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

డా. ఎన్. బాలసుబ్రహ్మణ్యంకు ఏపీఏఎస్ యువ శాస్త్రవేత్త పురస్కారం డా. ఎన్. బాలసుబ్రహ్మణ్యంకు ఏపీఏఎస్ యువ శాస్త్రవేత్త పురస్కారం
తిరుపతి :  శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాలలోని మెకానికల్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన అధ్యాపకులు డా. ఎన్. బాలసుబ్రహ్మణ్యం ప్రతిష్ఠాత్మకమైన ఆంధ్రప్రదేశ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్...
రోడ్డు ప్రమాద బాధిత కుటుంబానికి రూ. కోటి బీమా చెక్కు అందజేత
బెల్లంపల్లిలో మైనార్టీ ఫంక్షన్ హాల్ కలగానే మిగిలిపోతుందా?
చౌటుకూరు మండల కేంద్రంలో ఘనంగా పల్స్ పోలియో కార్యక్రమం.. చిన్నారులకు పోలియో చుక్కలు
చౌటకూర్‌లో రాత్రివేళల్లో మొరం టిప్పర్ల రవాణా.. మైనింగ్ అనుమతులపై స్థానికుల ప్రశ్నలు!
రూ.30 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ విద్యుత్ శాఖ అధికారి..!
సుప్రీంకోర్టు జడ్జికి ఇవ్వాల్సిన గౌరవ వందనం ఒవైసీకి..!