టీఎన్జీవో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా  సద్దుల బతుకమ్మ వేడుకలు

టీఎన్జీవో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా  సద్దుల బతుకమ్మ వేడుకలు

 మంచిర్యాల : టిఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి  మరియు మహిళా కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో బ్యాండ్ తో ఘనంగా ఎదుర్కొని మంటపం వద్దకు తీసుకొని వచ్చి వేడుకలు నిర్వహించారు  దీనిలో  సునీత  కేజియారాణి  పద్మలత పద్మజ  అరుణ  స్వప్న  జ్యోతి డా.సాహితీ  సరిత  పల్లవి ల ఆధ్వర్యంలో టీఎన్జీవో మహిళా సభ్యులు మహిళా నాయకులు కాలనీ మహిళలు అంగరంగ వైభవంగా బతుకమ్మ  ఆటపాటలతో బంగారు బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు . ఈ సందర్భంగా టిఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి  మాట్లాడుతూ ప్రతి సంవత్సరం టీఎన్జీవో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ గౌరమ్మను కోరుకుంటూ మహిళా సోదరీ సోదరీమణులందరికీ  సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు . ముఖ్య అతిథి  శ్యామల దేవి  మాట్లాడుతూ ప్రతి సంవత్సరం టీఎన్జీవో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే బతుకమ్మ  వేడుకలకు విచ్చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని టీఎన్జీవో యూనియన్ మహిళలకు ప్రత్యేక గుర్తింపునిస్తూ మహిళల కొరకు చాలా కార్యక్రమాలు చేస్తుందని వారికి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రతి సంవత్సరం టీఎన్జీవో ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించుకోవాలని చెప్పారు. ఈ బంగారు బతుకమ్మ వేడుకలలో టీఎన్జీవో మంచిర్యాల జిల్లా కార్యదర్శి బొడ్డు శ్రావణ్ కుమార్ కేంద్ర సంఘం కార్యదర్శి పొన్నమల్లయ్య అసోసియేట్ అధ్యక్షులు  బాపురావు కోశాధికారి అనుముల సతీష్ కుమార్ ఉపాధ్యక్షులు కూర్మచలం శ్రీనివాస్, నడిమెట్ల సత్యనారాయణ, తంగళ్ళపల్లి తిరుపతి, జాడి రామ్ కుమార్, పూదరి నరేందర్, అంజయ్య, సంయుక్త కార్యదర్శి ప్రభు, సురేందర్, కార్తీక్, రోశయ్య ఆర్గనైజింగ్ సెక్రటరీ మోషన్ పబ్లిసిటీ సెక్రటరీ యూసుఫ్ స్పోర్ట్స్ సెక్రటరీ కుమార్ కార్యవర్గ సభ్యులు రాజేందర్, ప్రణవ్ మంచిర్యాల్ యూనిట్ అధ్యక్షులు నాగుల గోపాల్ కార్యదర్శి అజయ్ ప్రశాంత్ మందమర్రి యూనియన్ అధ్యక్షులు సుమన్ బెల్లంపల్లి యూనిట్ అధ్యక్షులు వెంకటేశం చెన్నూర్ యూనిట్ అధ్యక్షులు అభిషేక్ టీఎన్జీవో కాలనీ మహిళలు పెద్దలు నాయకులు   తదితరులు పాల్గొన్నారు.

Views: 11

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

బిజినపల్లి యాదవ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు దసరా శుభాకాంక్షలు బిజినపల్లి యాదవ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు దసరా శుభాకాంక్షలు
బిజినపల్లి(నాగర్ కర్నూల్)బిజినపల్లిలోని యాదవుల ఇంటి ఆడబిడ్డగా కొలిచే చౌడేశ్వరి మాత ఆలయ అభివృద్ధికి సహాయ సహకారాలందించినందుకుబిజినపల్లి యాదవ సంఘం  ఆధ్వర్యంలో యాదవ సోదరులు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్...
దసరా పండుగ వేళ సొంతగ్రామం కొండారెడ్డిపల్లెకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాక - ఘన స్వాగతానికి ఏర్పాట్లు
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దసరా 
ఎల్ఎన్ఎస్ ప్రభావ నివారణకు యాసంగిలో నీటి పొదుపుపై ప్రత్యేక దృష్టి: జిల్లా వ్యవసాయ అధికారి యశ్వంత్ రావు
రామవరంలో ఘనంగా బతుకమ్మ నిమజ్జనాలు!
ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మమే మిమ్ముల్ని రక్షస్తుంది డా,, అబ్బాగోని 
సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న ‘బేబీ’ హీరోయిన్ వైష్ణవి చైతన్య