దసరాకు పుట్టింటికి వస్తుండగా ఘోర ప్రమాదం.. అన్నాచెల్లెలు స్పాట్లోనే మృతి
హయత్నగర్లో కారు ఢీకొని విషాదం.. తీవ్రంగా గాయపడిన చిన్నారి ఆస్పత్రికి తరలింపు
హైదరాబాద్: దసరా పండుగ వేళ హైదరాబాద్లో విషాదం చోటుచేసుకుంది. పండుగ సందర్భంగా చెల్లిని పుట్టింటికి తీసుకొస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో అన్నాచెల్లెలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన హయత్నగర్లో చోటుచేసుకుంది.శంషాబాద్ నుంచి పెద్దఅంబర్పేటలోని పుట్టింటికి చెల్లి రేఖ, కోడలిని అన్న నవీన్ యాక్టివాపై తీసుకొస్తుండగా.. మార్గమధ్యంలో ఓ కారు వారి వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నవీన్, రేఖ అక్కడికక్కడే మృతి చెందారు. వారితో పాటు ప్రయాణిస్తున్న చిన్నారి తీవ్రంగా గాయపడింది.గాయపడిన చిన్నారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.పండుగ రోజున అన్నాచెల్లెలు మృతి చెందడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. మృతదేహాల వద్ద కుటుంబ సభ్యులు రోదిస్తున్న దృశ్యాలు అక్కడివారిని కంటతడి పెట్టించాయి.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


