గోవా అక్రమ మద్యం పట్టివేత

గోవా అక్రమ మద్యం పట్టివేత

గంభీరావుపేట : గంభీరావుపేట మండలంలో అక్రమంగా నిల్వ ఉంచిన గోవా మద్యాన్ని ఎక్సైజ్ అధికారులు  స్వాధీనం చేసుకుని, ఒక వ్యక్తిని అరెస్టు చేశారు.ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ విజేందర్ అందించిన వివరాల ప్రకారం, డిసి ఆదేశాల మేరకు మరియు ఎసి పర్యవేక్షణలో, స్పెషల్ డ్రైవ్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా, గంభీరావుపేట మండలంలోని లక్ష్మీపూర్, గోరింటాకు, లింగన్నపేట, సముద్ర లింగాపూర్ మరియు గజసింగవరం గ్రామాలలో సోమవారం విస్తృతమైన సోదాలు నిర్వహించారు.ఈ తనిఖీల సందర్భంగా, గోరింటాల కు గ్రామానికి చెందిన కుమ్మరి నాగరాజు వద్ద ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా అక్రమంగా నిల్వ ఉంచిన 750 ఎంఎల్ సామర్థ్యం గల 15 బాటిళ్ల గోవా నాన్-డ్యూటీ పెయిడ్ లిక్కర్ (ఎన్‌డిపిఎల్)ను అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు ఎక్సైజ్ సిఐ తెలిపారు.ఈ దాడుల్లో ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్‌తో పాటు హెడ్ కానిస్టేబుల్ మోహిస్, కానిస్టేబుళ్లు సిద్ది రాములు, కరుణాకర్, కృషిధర్, వర్ష తదితరులు పాల్గొన్నారు.

Views: 190

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

బిజినపల్లి యాదవ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు దసరా శుభాకాంక్షలు బిజినపల్లి యాదవ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు దసరా శుభాకాంక్షలు
బిజినపల్లి(నాగర్ కర్నూల్)బిజినపల్లిలోని యాదవుల ఇంటి ఆడబిడ్డగా కొలిచే చౌడేశ్వరి మాత ఆలయ అభివృద్ధికి సహాయ సహకారాలందించినందుకుబిజినపల్లి యాదవ సంఘం  ఆధ్వర్యంలో యాదవ సోదరులు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్...
దసరా పండుగ వేళ సొంతగ్రామం కొండారెడ్డిపల్లెకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాక - ఘన స్వాగతానికి ఏర్పాట్లు
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దసరా 
ఎల్ఎన్ఎస్ ప్రభావ నివారణకు యాసంగిలో నీటి పొదుపుపై ప్రత్యేక దృష్టి: జిల్లా వ్యవసాయ అధికారి యశ్వంత్ రావు
రామవరంలో ఘనంగా బతుకమ్మ నిమజ్జనాలు!
ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మమే మిమ్ముల్ని రక్షస్తుంది డా,, అబ్బాగోని 
సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న ‘బేబీ’ హీరోయిన్ వైష్ణవి చైతన్య