ముస్లిం దూదేకుల కుటుంబాలందరూ సర్వే ఫామ్‌ను పూర్తి చేయాలి
తెలంగాణ ముస్లిం దూదేకుల బీసీ సంక్షేమ జేఏసీ విజ్ఞప్తి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ముస్లిం దూదేకుల కుటుంబాల సామాజిక, ఆర్థిక వివరాలను సేకరించే లక్ష్యంతో తెలంగాణ ముస్లిం దూదేకుల బీసీ సంక్షేమ జేఏసీ ఆధ్వర్యంలో ప్రత్యేక సర్వే ఫామ్‌ను విడుదల చేశారు. జేఏసీ చైర్మన్ మహమ్మద్ రఫీ, వైస్ చైర్మన్ మహమ్మద్ రాజమ్మద్ ఆధ్వర్యంలో Tgdudekulajac.org/survey వెబ్‌సైట్ ద్వారా ఈ సర్వే ఫామ్‌ను అందుబాటులోకితీసుకొచ్చారు.రాష్ట్రవ్యాప్తంగా నివసిస్తున్న ముస్లిం దూదేకుల సామాజిక వర్గానికి చెందిన కుటుంబ సభ్యులందరూ ఈ సర్వేలో పాల్గొని, ఫామ్‌లో అడిగిన వివరాలను పూర్తిగా నమోదు చేయాలని జేఏసీ నాయకులు విజ్ఞప్తి చేశారు. ప్రతి కుటుంబం నుంచి సరైన వివరాలు సేకరించడం ద్వారా సామాజిక వర్గానికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని అందుబాటులోకి తీసుకురావచ్చని పేర్కొన్నారు.ముస్లిం దూదేకుల వర్గానికి సంబంధించిన సమస్యలు, అవసరాలు, సంక్షేమ కార్యక్రమాలపై భవిష్యత్తులో సమర్థవంతంగా కృషి చేయడానికి ఈ వివరాలు ఉపయోగపడతాయని జేఏసీ నాయకులు తెలిపారు. అందువల్ల రాష్ట్రంలోని పట్టణాలు, గ్రామాల్లో నివసిస్తున్న ప్రతి కుటుంబం ఆలస్యం చేయకుండా సర్వే ఫామ్‌ను పూర్తి చేయాలని కోరారు.ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జేఏసీ నాయకులు, సంఘ ప్రతినిధులు, యువత ముందుకు వచ్చి తమ ప్రాంతాల్లోని కుటుంబాలకు అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు.సర్వే ఫామ్ లింక్: https://Tgdudekulajac.org/surveyతెలంగాణలోని ముస్లిం దూదేకుల కుటుంబ సభ్యులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని సర్వేను త్వరగా పూర్తి చేయాలని తెలంగాణ ముస్లిం దూదేకుల బీసీ సంక్షేమ జేఏసీ విజ్ఞప్తి చేసింది.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


