సింగారం, ఎద్దుమిట్టతండా గ్రామాలలో ఎస్బీఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్వో. వాటర్ ప్లాంట్ ప్రారంభం
అచ్చంపేట, (నాగర్ కర్నూలు జిల్లా:) అచ్చంపేట మండలంలోని సింగారం, ఎద్దుమిట్టతండా గ్రామాలలో గ్రామస్తుల దీర్ఘకాలిక తాగునీటి సమస్యకు పరిష్కారం లభించింది. ఎస్బీఐ ఫౌండేషనవారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన సురక్షిత తాగునీటి ప్లాంటును ఆదివారం ప్రారంభించారు ప్లాంట్ సర్పంచ్ నీలం శేఖర్ ప్రారంభిస్తున్న ఎస్బీఐ ప్రతినిధి శంకరయ్యవెటర్నరీ డాక్టర్ నిహాల్ఉ పసర్పంచ్ శివ నాయక్ వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు, సింగారం, ఎద్దుమిట్టతండా గ్రామంలో గత కొన్నేళ్లుగా ఫ్లోరైడ్, ఉప్పు నీటి సమస్య ఉంది. బోరు నీటిలో ఫ్లోరైడ్ శాతం ఎక్కువగా ఉండటంతో గ్రామస్తులు తాగునీటి కోసం ఇబ్బందులు , పడుతుండేవారు. ముఖ్యంగా వేసవిలో తాగునీటి ఎద్దడి ఎక్కువగా ఉంటుంది.ఈ సమస్యను సర్పంచ్ నీలం శేఖర్, గోపాల్ నాయక్ ఎస్బీఐ ఫౌండేషన్ దృష్టికి తీసుకెళ్లడంతో, వారు రూ. 5 లక్షల వ్యయంతో ఈ ఆర్వో వాటర్ ప్లాంట్ ను మంజూరు చేశారు- ఎస్బీఐ ఫౌండేషన్ ప్రతినిధి శంకరయ్య- వెటర్నరీ డాక్టర్ నిహాల్హ- ఉపసర్పంచ్ శివ నాయక్- వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు
సర్పంచ్ నీలం శేఖర్ మాట్లాడుతూగ్రామ ప్రజలకు స్వచ్ఛమైన, సురక్షితమైన తాగునీటిని అందించాలనే లక్ష్యంతో ఎస్బీఐ ఫౌండేషన్ సహకారంతో ఈ ఆర్వో ప్లాంట్ ను ఏర్పాటు చేశాం. ఇకపై గ్రామంలో ప్రతి ఒక్కరికి 20 లీటర్ల స్వచ్ఛమైన నీటిని తక్కువ ధరకే అందిస్తాం. ఈ ప్లాంట్ ఏర్పాటుకు సహకరించిన ఎస్బీఐ ఫౌండేషన్ వారికి, శంకరయ్య గారికి గ్రామ పంచాయతీ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు..
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


