ఆదిలాబాద్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబురాలు....

ప్రకృతి పరిరక్షణతో పాటు నీటి సంరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి: జిల్లా కలెక్టర్ రాజర్షి షా, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయ లకు ప్రతీక బతుకమ్మ..... ఏ ఎం సి చైర్మన్ బోరంచు, ఎస్పీ అఖిల్ మహాజన్‌ 

ఆదిలాబాద్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబురాలు....

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ఆదిలాబాద్ జిల్లాలో ఘనంగా నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. సద్దుల బతుకమ్మను పురస్కరించుకొని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి స్థానిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నిర్వహించిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి వేడుకలను ప్రారంభించారు.కలెక్టర్‌తో పాటు ఎస్పీ అఖిల్ మహాజన్, మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి పాల్గొని బతుకమ్మను ఆడుతూ మహిళలు, యువతులతో కలిసి సంబురాల్లో భాగస్వాములయ్యారు. సాంస్కృతిక కార్యక్రమాలు, బతుకమ్మ పాటలతో స్టేడియం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, బతుకమ్మ పండుగ తెలంగాణ మహిళల సాంస్కృతిక జీవనానికి, ప్రకృతితో మమేకమైన మన సంప్రదాయానికి ప్రతీక అని అన్నారు. మహిళలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రకృతిని ఆరాధించే బతుకమ్మ పండుగ సందేశాన్ని ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో నీటి కొరత వంటి సమస్యలు ఎదురుకాకుండా ఇప్పటి నుంచే నీటి సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. చుక్క నీటిని కూడా వృథా చేయకుండా, ప్రకృతి వనరులను పరిరక్షిస్తూ, విద్యుత్‌ను పొదుపుగా వినియోగించాలని ప్రజలను కోరారు.బతుకమ్మ వేడుకల్లో భాగంగా నిర్వహించిన పోటీల్లో ప్రతిభ కనబరిచిన పలువురు మండలాల మహిళా సమైక్య సభ్యులకు జిల్లా కలెక్టర్, ఇతర ప్రజాప్రతినిధులు బహుమతులు అందజేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రైతులు, మహిళలు, యువతులు, జిల్లా ప్రజలందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మ పండుగ ప్రతి ఇంట ఆనందాన్ని, సౌభాగ్యాన్ని నింపాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఆర్.ఎస్. చిత్రూ, ఎస్. రాజేశ్వర్, డీఆర్‌డీఓ రవీందర్ రాథోడ్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్, జిల్లా సంక్షేమ, ఎస్సీ సంక్షేమ అధికారులు మిల్కా, సునీత కుమారి, మహిళా సమైక్య ప్రతినిధులు, బాలికలు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Views: 6

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

బిజినపల్లి యాదవ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు దసరా శుభాకాంక్షలు బిజినపల్లి యాదవ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు దసరా శుభాకాంక్షలు
బిజినపల్లి(నాగర్ కర్నూల్)బిజినపల్లిలోని యాదవుల ఇంటి ఆడబిడ్డగా కొలిచే చౌడేశ్వరి మాత ఆలయ అభివృద్ధికి సహాయ సహకారాలందించినందుకుబిజినపల్లి యాదవ సంఘం  ఆధ్వర్యంలో యాదవ సోదరులు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్...
దసరా పండుగ వేళ సొంతగ్రామం కొండారెడ్డిపల్లెకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాక - ఘన స్వాగతానికి ఏర్పాట్లు
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దసరా 
ఎల్ఎన్ఎస్ ప్రభావ నివారణకు యాసంగిలో నీటి పొదుపుపై ప్రత్యేక దృష్టి: జిల్లా వ్యవసాయ అధికారి యశ్వంత్ రావు
రామవరంలో ఘనంగా బతుకమ్మ నిమజ్జనాలు!
ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మమే మిమ్ముల్ని రక్షస్తుంది డా,, అబ్బాగోని 
సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న ‘బేబీ’ హీరోయిన్ వైష్ణవి చైతన్య