కల్వకుర్తి ఎల్ఐసీ కార్యాలయంలో ఘనంగా దుర్గాదేవి పూజ

ఏజెంట్లు మరింత ఉత్సాహంగా వ్యాపారం చేయాలి..  ఎక్కువ కుటుంబాలకు బీమా రక్షణ కల్పించాలి

కల్వకుర్తి ఎల్ఐసీ కార్యాలయంలో ఘనంగా దుర్గాదేవి పూజ

కల్వకుర్తి, : కల్వకుర్తి ఎల్ఐసీ కార్యాలయంలో దుర్గాదేవి పూజను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి, సంస్థ అభివృద్ధితో పాటు సిబ్బంది, ఏజెంట్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ఎల్ఐసీ బ్రాంచ్ మేనేజర్ పోలిశెట్టి శ్రీనివాస్ బాబు అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ రాజబాబు అభివృద్ధి అధికారులు, ఏజెంట్లు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. కార్యాలయంలో పండుగ వాతావరణం నెలకొంది.ఈ సందర్భంగా ఏజెంట్లు మరింత ఉత్సాహంతో బీమా వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలని, ఎక్కువ మంది ప్రజలకు ఎల్ఐసీ పాలసీలను అందించి వారి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించాలని ఆకాంక్షించారు. ప్రతి కుటుంబానికి జీవిత బీమా అవసరాన్ని వివరించి, భవిష్యత్తులో ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందుల నుంచి వారికి రక్షణ కల్పించేలా కృషి చేయాలని సూచించారు. ఏజెంట్లు సమష్టిగా పనిచేస్తూ సంస్థ వ్యాపారాభివృద్ధికి తోడ్పడాలని, ప్రజల్లో జీవిత బీమాపై అవగాహన పెంచాలని పేర్కొన్నారు.

Views: 164

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

బిజినపల్లి యాదవ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు దసరా శుభాకాంక్షలు బిజినపల్లి యాదవ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు దసరా శుభాకాంక్షలు
బిజినపల్లి(నాగర్ కర్నూల్)బిజినపల్లిలోని యాదవుల ఇంటి ఆడబిడ్డగా కొలిచే చౌడేశ్వరి మాత ఆలయ అభివృద్ధికి సహాయ సహకారాలందించినందుకుబిజినపల్లి యాదవ సంఘం  ఆధ్వర్యంలో యాదవ సోదరులు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్...
దసరా పండుగ వేళ సొంతగ్రామం కొండారెడ్డిపల్లెకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాక - ఘన స్వాగతానికి ఏర్పాట్లు
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దసరా 
ఎల్ఎన్ఎస్ ప్రభావ నివారణకు యాసంగిలో నీటి పొదుపుపై ప్రత్యేక దృష్టి: జిల్లా వ్యవసాయ అధికారి యశ్వంత్ రావు
రామవరంలో ఘనంగా బతుకమ్మ నిమజ్జనాలు!
ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మమే మిమ్ముల్ని రక్షస్తుంది డా,, అబ్బాగోని 
సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న ‘బేబీ’ హీరోయిన్ వైష్ణవి చైతన్య