పార్టీలకతీతంగా అందరూ పాల్గొని దసరా ఉత్సవాలను విజయవంతం చేయాలి -  షబ్బీర్ అలీ 

- ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు.

పార్టీలకతీతంగా అందరూ పాల్గొని దసరా ఉత్సవాలను విజయవంతం చేయాలి -  షబ్బీర్ అలీ 

కామారెడ్డి : కామారెడ్డి పట్టణంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించనున్న దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ తెలిపారు.ఈ సందర్భంగా దసరా ఉత్సవాల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను షబ్బీర్ అలీ స్వయంగా పరిశీలించి  కార్యక్రమాల నిర్వహణపై సమీక్షించారు. ఈ ఉత్సవాలను కులమతాలకు, రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజలందరూ కలిసి జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.స్థానిక ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులకు ప్రత్యేకంగా ఆహ్వాన పత్రికలు పంపించి ఉత్సవాలకు ఆహ్వానించనున్నట్లు తెలిపారు.- అన్ని శాఖల అధికారులతో సమీక్ష.దసరా ఉత్సవాల సందర్భంగా ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు మున్సిపల్, రెవెన్యూ, వైద్య ఆరోగ్య, క్రీడలు, పోలీస్, అగ్నిమాపక, విద్యుత్, ట్రాఫిక్ తదితర శాఖల అధికారులతో షబ్బీర్ అలీ గారు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉత్సవాలకు వచ్చే ప్రజల భద్రత, సౌకర్యాల విషయంలో అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.- ప్రజల సౌకర్యాలకు ప్రత్యేక ఏర్పాట్లుఉత్సవాలకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నందున తాగునీటి సదుపాయం, భద్రతా ఏర్పాట్లు, మరుగుదొడ్లు, ట్రాఫిక్ నియంత్రణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. ప్రజలకు అవసరమైన సమాచారం అందించేందుకు ప్రత్యేక హెల్ప్ డెస్క్‌ను కూడా ఏర్పాటు చేయనున్నారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సంబంధిత శాఖలు అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు.
కామారెడ్డి పట్టణంలో దసరా ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, కుటుంబ సమేతంగా పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ కోరారు.ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సీనియర్ నాయకులు, పాత్రికేయ మిత్రులు, తతిదారులు పాల్గొన్నారు.

Views: 10

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

బిజినపల్లి యాదవ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు దసరా శుభాకాంక్షలు బిజినపల్లి యాదవ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు దసరా శుభాకాంక్షలు
బిజినపల్లి(నాగర్ కర్నూల్)బిజినపల్లిలోని యాదవుల ఇంటి ఆడబిడ్డగా కొలిచే చౌడేశ్వరి మాత ఆలయ అభివృద్ధికి సహాయ సహకారాలందించినందుకుబిజినపల్లి యాదవ సంఘం  ఆధ్వర్యంలో యాదవ సోదరులు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్...
దసరా పండుగ వేళ సొంతగ్రామం కొండారెడ్డిపల్లెకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాక - ఘన స్వాగతానికి ఏర్పాట్లు
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దసరా 
ఎల్ఎన్ఎస్ ప్రభావ నివారణకు యాసంగిలో నీటి పొదుపుపై ప్రత్యేక దృష్టి: జిల్లా వ్యవసాయ అధికారి యశ్వంత్ రావు
రామవరంలో ఘనంగా బతుకమ్మ నిమజ్జనాలు!
ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మమే మిమ్ముల్ని రక్షస్తుంది డా,, అబ్బాగోని 
సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న ‘బేబీ’ హీరోయిన్ వైష్ణవి చైతన్య