నెల దాటినా పీఆర్సీ నివేదిక ఏదీ? సీఎస్‌ ఇచ్చిన హామీకి దిక్కెవరు?

గడువు ముగిసినా ప్రభుత్వంలో చలనం కరువు 39 నెలలుగా వేతన సవరణ కోసం ఉద్యోగుల ఎదురుచూపులు రిటైర్డ్ వొకేషనల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఏడబోయిన శ్రీనివాస్ రెడ్డి

నెల దాటినా పీఆర్సీ నివేదిక ఏదీ?  సీఎస్‌ ఇచ్చిన హామీకి దిక్కెవరు?

అక్కన్నపేట, :తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల వేతన సవరణపై ప్రభుత్వం జాప్యం చేస్తోందని రిటైర్డ్ వొకేషనల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఏడబోయిన శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. పీఆర్సీ నివేదికను సకాలంలో తెప్పించుకోలేకపోవడంపై ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందన్నారు. ఉద్యోగుల జేఏసీతో సెప్టెంబర్ 9న జరిగిన చర్చల సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సెప్టెంబర్ 18లోగా పీఆర్సీ నివేదికను తెప్పించుకుంటామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. నివేదికను తక్షణమే సమర్పించాలని పీఆర్సీ కమిటీకి లేఖ రాసినప్పటికీ, గడువు ముగిసి నెల దాటుతున్నా పురోగతి లేకపోవడం ఆందోళనకరమన్నారు.దసరాలోపు నివేదిక.. దీపావళిలోపు పీఆర్సీ అమలు చేయాలిసీఎస్‌ ఇచ్చిన హామీ మేరకు పీఆర్సీ నివేదికను ప్రభుత్వం వెంటనే తెప్పించుకోవాలని శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. దసరాలోపు నివేదికను స్వీకరించి, దీపావళిలోపు రెండో పీఆర్సీని అమలు చేసేలా చర్యలు చేపట్టాలని ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు, టీజీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. శ్యామ్, టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎం హుస్సేనీ (ముజీబ్) చేసిన డిమాండ్‌కు ఆయన మద్దతు తెలిపారు. ఉద్యోగుల వేతన సవరణ విషయంలో మరింత జాప్యం చేయకుండా ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని కోరారు.39 నెలలుగా వేతన సవరణ కోసం ఎదురుచూపులుతెలంగాణ తొలి పీఆర్సీ గడువు 2023 జూన్ 30తో ముగియడంతో, రెండో పీఆర్సీని 2023 జూలై 1 నుంచి అమలు చేయాల్సి ఉందని శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. అయితే ఇప్పటివరకు కొత్త పీఆర్సీ ప్రకటించకపోవడంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు వేతన సవరణ ప్రయోజనాల కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. ఈ జాప్యం వల్ల ఉద్యోగ వర్గాలు ఆర్థికంగా నష్టపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.పీఆర్టీయూ, తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్), టీఎస్‌యూటీఎఫ్ తదితర సంఘాలు కూడా తక్షణమే పీఆర్సీ ప్రకటించాలని కోరుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం వెంటనే నివేదికను తెప్పించుకుని, ఉద్యోగులు ఆశిస్తున్న విధంగా మెరుగైన ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ అమలు చేయాలని ఏడబోయిన శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు.

Views: 34

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

బిజినపల్లి యాదవ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు దసరా శుభాకాంక్షలు బిజినపల్లి యాదవ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు దసరా శుభాకాంక్షలు
బిజినపల్లి(నాగర్ కర్నూల్)బిజినపల్లిలోని యాదవుల ఇంటి ఆడబిడ్డగా కొలిచే చౌడేశ్వరి మాత ఆలయ అభివృద్ధికి సహాయ సహకారాలందించినందుకుబిజినపల్లి యాదవ సంఘం  ఆధ్వర్యంలో యాదవ సోదరులు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్...
దసరా పండుగ వేళ సొంతగ్రామం కొండారెడ్డిపల్లెకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాక - ఘన స్వాగతానికి ఏర్పాట్లు
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దసరా 
ఎల్ఎన్ఎస్ ప్రభావ నివారణకు యాసంగిలో నీటి పొదుపుపై ప్రత్యేక దృష్టి: జిల్లా వ్యవసాయ అధికారి యశ్వంత్ రావు
రామవరంలో ఘనంగా బతుకమ్మ నిమజ్జనాలు!
ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మమే మిమ్ముల్ని రక్షస్తుంది డా,, అబ్బాగోని 
సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న ‘బేబీ’ హీరోయిన్ వైష్ణవి చైతన్య