సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న ‘బేబీ’ హీరోయిన్ వైష్ణవి చైతన్య

నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు.. ఆశీర్వచనం అందించిన ఆలయ అర్చకులు

సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న ‘బేబీ’ హీరోయిన్ వైష్ణవి చైతన్య

సికింద్రాబాద్: దేవి నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు, భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ‘బేబీ’ సినిమా ఫేమ్ హీరోయిన్ వైష్ణవి చైతన్య సికింద్రాబాద్‌లోని ప్రఖ్యాత శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవస్థానాన్ని సందర్శించారు.ఆలయానికి చేరుకున్న వైష్ణవి చైతన్య అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆమెకు ఆశీర్వచనం అందించి, తీర్థప్రసాదాలను అందజేశారు.వైష్ణవి చైతన్య ఆలయాన్ని సందర్శించిన సందర్భంగా భక్తులు, ఆలయ సిబ్బంది ఆమెను ఆప్యాయంగా పలకరించారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త దేవి వరప్రసాద్, రాంగోపాల్‌పేట్ డివిజన్ మాజీ అధ్యక్షుడు మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.

Views: 6

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

బిజినపల్లి యాదవ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు దసరా శుభాకాంక్షలు బిజినపల్లి యాదవ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు దసరా శుభాకాంక్షలు
బిజినపల్లి(నాగర్ కర్నూల్)బిజినపల్లిలోని యాదవుల ఇంటి ఆడబిడ్డగా కొలిచే చౌడేశ్వరి మాత ఆలయ అభివృద్ధికి సహాయ సహకారాలందించినందుకుబిజినపల్లి యాదవ సంఘం  ఆధ్వర్యంలో యాదవ సోదరులు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్...
దసరా పండుగ వేళ సొంతగ్రామం కొండారెడ్డిపల్లెకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాక - ఘన స్వాగతానికి ఏర్పాట్లు
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దసరా 
ఎల్ఎన్ఎస్ ప్రభావ నివారణకు యాసంగిలో నీటి పొదుపుపై ప్రత్యేక దృష్టి: జిల్లా వ్యవసాయ అధికారి యశ్వంత్ రావు
రామవరంలో ఘనంగా బతుకమ్మ నిమజ్జనాలు!
ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మమే మిమ్ముల్ని రక్షస్తుంది డా,, అబ్బాగోని 
సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న ‘బేబీ’ హీరోయిన్ వైష్ణవి చైతన్య