బిజినపల్లి యాదవ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు దసరా శుభాకాంక్షలు
బిజినపల్లి(నాగర్ కర్నూల్)బిజినపల్లిలోని యాదవుల ఇంటి ఆడబిడ్డగా కొలిచే చౌడేశ్వరి మాత ఆలయ అభివృద్ధికి సహాయ సహకారాలందించినందుకుబిజినపల్లి యాదవ సంఘం ఆధ్వర్యంలో యాదవ సోదరులు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ కుచ్చుకుళ్ల రాజేష్ రెడ్డి మరియు ఎమ్మెల్సీ కుచ్చుకుళ్ల దామోదర్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపి, దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్.రాజేష్ రెడ్డి మాట్లాడుతూ చౌడేశ్వరి మాత ఆశీస్సులతో బిజినపల్లి అభివృద్ధి చెందుతోందని, అమ్మవారి ఆలయ అభివృద్ధికి తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. అందరం కలిసి అమ్మవారి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేద్దామని పిలుపునిచ్చారు. యాదవ సోదరులందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంనకు బిజినపల్లి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మిద్దె రాములు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ గంగనమోని తిరుపతయ్య, బిజినపల్లి డిప్యూటీ సర్పంచ్ గడ్డమీది మహేష్, యాదవ సంఘం సోదరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


