బతుకమ్మ సంబరాలకు భారీ ఏర్పాట్లు చేసిన కార్పొరేషన్ అధికారులు
మంచిర్యాల: తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక అయిన పూల పండుగ బతుకమ్మ వేడుకలను మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నగరంలోని ప్రధాన చౌరస్తాలు, చెరువులు, ఘాట్ల వద్ద మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక వేదికలు, విద్యుత్ దీపాల అలంకరణ, తాగునీటి సదుపాయాలు మరియు ముమ్మర పారిశుధ్య చర్యలు చేపట్టారు. వేడుకలు జరిగే ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు మరియు సీసీ కెమెరాల నిఘాను ఏర్పాటు చేసినట్లు కార్పొరేషన్ అధికారులు తెలిపారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


