మల్లన్న సన్నిధిలో సద్దుల బతుకమ్మ సంబరాలు  రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మలు

మల్లన్న సన్నిధిలో సద్దుల బతుకమ్మ సంబరాలు  రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మలు

సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కొమురెల్లి మల్లికార్జున స్వామి దేవస్థానం ప్రాంగణంలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి.తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ పండుగను కొమురవెల్లి మండలంలో ఆడపడుచులు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, బతుకమ్మ పాటలు పాడుతూ మహిళలు, యువతులు పండుగ సంబరాల్లో మునిగిపోయారు.బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో..అంటూ మారుమోగిన పాటలు, ఆడపడుచుల సందడితో పల్లెలన్నీ పులకించిపోయాయి. గౌరమ్మకు పసుపు, కుంకుమలతో పూజలు నిర్వహిస్తూ తమ కుటుంబాలు సుఖసంతోషాలతో ఉండాలని, ఎలాంటి కష్టాలు రాకుండా చూడాలని మహిళలు భక్తిశ్రద్ధలతో ప్రార్థించారు. పాడిపంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని అమ్మవారిని వేడుకున్నారు.కొమురవెల్లి మండల కేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో సద్దుల బతుకమ్మ వేడుకలు పండుగ వాతావరణాన్ని నింపాయి. పూలతో అలంకరించిన బతుకమ్మలు, మహిళల ఆటపాటలు, సంప్రదాయ వేడుకలతో గ్రామాలు కొత్త శోభను సంతరించుకున్నాయి.తరతరాలుగా వస్తున్న తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ ఆడపడుచులు సద్దుల బతుకమ్మ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రకృతిని ఆరాధిస్తూ, పూలను పూజిస్తూ జరుపుకునే బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఐక్యతకు, సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచింది.

Views: 8

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

బిజినపల్లి యాదవ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు దసరా శుభాకాంక్షలు బిజినపల్లి యాదవ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు దసరా శుభాకాంక్షలు
బిజినపల్లి(నాగర్ కర్నూల్)బిజినపల్లిలోని యాదవుల ఇంటి ఆడబిడ్డగా కొలిచే చౌడేశ్వరి మాత ఆలయ అభివృద్ధికి సహాయ సహకారాలందించినందుకుబిజినపల్లి యాదవ సంఘం  ఆధ్వర్యంలో యాదవ సోదరులు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్...
దసరా పండుగ వేళ సొంతగ్రామం కొండారెడ్డిపల్లెకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాక - ఘన స్వాగతానికి ఏర్పాట్లు
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దసరా 
ఎల్ఎన్ఎస్ ప్రభావ నివారణకు యాసంగిలో నీటి పొదుపుపై ప్రత్యేక దృష్టి: జిల్లా వ్యవసాయ అధికారి యశ్వంత్ రావు
రామవరంలో ఘనంగా బతుకమ్మ నిమజ్జనాలు!
ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మమే మిమ్ముల్ని రక్షస్తుంది డా,, అబ్బాగోని 
సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న ‘బేబీ’ హీరోయిన్ వైష్ణవి చైతన్య