ఎల్ఎన్ఎస్ ప్రభావ నివారణకు యాసంగిలో నీటి పొదుపుపై ప్రత్యేక దృష్టి: జిల్లా వ్యవసాయ అధికారి యశ్వంత్ రావు
నాగర్ కర్నూల్ : ఎల్నినో ప్రభావం దృష్ట్యా యాసంగి సీజన్లో నీటి పొదుపుపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా వ్యవసాయ అధికారి ఎన్. యశ్వంత్ రావు అధికారులకు సూచించారు. యాసంగిలో నీటి అవసరాన్ని తగ్గించి, ప్రతి సాగునీటి చుక్కను సద్వినియోగం చేసుకోవాలన్నారు. తక్కువ నీటితో అధిక దిగుబడినిచ్చే పంటలను సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. వానాకాలంలో వరి సాగు చేసిన రైతులు కోతల అనంతరం పొలాల్లో మిగిలిన తేమను వినియోగించుకుని పెసర, మినుములు, పప్పుధాన్యాలు, ఆముదం, నువ్వులు వంటి పంటల సాగును, సల్వా కాలిక పంటలను ప్రోత్సహించాలన్నారు. కాలువల ద్వారా నీటి సరఫరా పరిమితంగా ఉండే ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పించాలని, నీటి లభ్యతపై స్పష్టత లేకుండా అధిక నీటి అవసరమయ్యే వరి, మొక్కజొన్న వంటి పంటలను సాగు చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వాతావరణ పరిస్థితులు, నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని రైతులకు పంటల ఎంపికపై గ్రామసభలు, రైతు సమావేశాలు, శిక్షణ కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పించాలని, జిల్లా, మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు సమన్వయంతో పనిచేసి రైతులకు అవసరమైన సలహాలు అందించాలని ఆదేశించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


