అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ సంబరాలు

-- పెద్ద చెరువు వేదికగా బతుకమ్మ సంబరాలు... -- పూల పండుగకు ఘన వీడ్కోలు.... -- తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలు.. ఆటపాటలతో సందడి చేసిన మహిళలు

అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ సంబరాలు

కారేపల్లి(ఖమ్మం) ;సింగరేణి మండల కేంద్రంలో సద్దుల బతుకమ్మ వేడుకలను ఆదివారం మహిళలు ఘనంగా నిర్వహించారు.తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని మహిళలు తీరొక్క పూలతో అందంగా బతుకమ్మలను పేర్చి వేడుకల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా మహిళలు బతుకమ్మలను చేతబూని డీజే చప్పుళ్లు, ఆటపాటలతో సందడి చేస్తూ గుంపులుగా పెద్ద చెరువు ఆవరణలో ఏర్పాటు చేసిన వేదిక వద్దకు చేరుకున్నారు.అక్కడ బతుకమ్మలను ఉంచి, సంప్రదాయబద్ధంగా చుట్టూ తిరుగుతూ "బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో" అంటూ చప్పట్లు కొడుతూ ఉత్సాహంగా పాటలు పాడారు. మహిళల ఆటపాటలు, కోలాహలంతో వేడుకల ప్రాంగణం సందడిగా మారింది.అనంతరం మహిళలు భక్తిశ్రద్ధలతో "పోయిరా బతుకమ్మ.. మళ్లీ రావమ్మా" అంటూ బతుకమ్మలకు వీడ్కోలు పలికారు.పెద్ద చెరువు నీటిలో బతుకమ్మలను నిమజ్జనం చేసి పండుగను సంప్రదాయబద్ధంగా ముగించారు. సద్దుల బతుకమ్మ వేడుకలతో సింగరేణి మండల కేంద్రంలో పండుగ వాతావరణం నెలకొంది.

Views: 1

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

బిజినపల్లి యాదవ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు దసరా శుభాకాంక్షలు బిజినపల్లి యాదవ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు దసరా శుభాకాంక్షలు
బిజినపల్లి(నాగర్ కర్నూల్)బిజినపల్లిలోని యాదవుల ఇంటి ఆడబిడ్డగా కొలిచే చౌడేశ్వరి మాత ఆలయ అభివృద్ధికి సహాయ సహకారాలందించినందుకుబిజినపల్లి యాదవ సంఘం  ఆధ్వర్యంలో యాదవ సోదరులు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్...
దసరా పండుగ వేళ సొంతగ్రామం కొండారెడ్డిపల్లెకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాక - ఘన స్వాగతానికి ఏర్పాట్లు
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దసరా 
ఎల్ఎన్ఎస్ ప్రభావ నివారణకు యాసంగిలో నీటి పొదుపుపై ప్రత్యేక దృష్టి: జిల్లా వ్యవసాయ అధికారి యశ్వంత్ రావు
రామవరంలో ఘనంగా బతుకమ్మ నిమజ్జనాలు!
ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మమే మిమ్ముల్ని రక్షస్తుంది డా,, అబ్బాగోని 
సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న ‘బేబీ’ హీరోయిన్ వైష్ణవి చైతన్య