దసరా పండుగ వేళ గ్రామపంచాయతీ సిబ్బందికి నూతన వస్త్రాల బహుకరణ
పండుగ ఆనందాన్ని పంచిన మాజీ మార్కెట్ డైరెక్టర్ బుషిగంపల ఆంజనేయులు
లింగాల గణపురం (జనగాం)కళ్లెం: దసరా పండుగను పురస్కరించుకుని కళ్లెం గ్రామపంచాయతీ సిబ్బందికి జనగామ వ్యవసాయ మార్కెట్ మాజీ డైరెక్టర్ బుషిగంపల ఆంజనేయులు నూతన వస్త్రాలను బహుకరించి పండుగ ఆనందాన్ని పంచుకున్నారు. పండుగ వేళ గ్రామపంచాయతీ సిబ్బందిని గౌరవిస్తూ వస్త్రాలను అందించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆంజనేయులు గ్రామపంచాయతీ సిబ్బందికి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. గ్రామ అభివృద్ధిలో, ప్రజలకు సేవలందించడంలో సిబ్బంది చేస్తున్న కృషిని అభినందించారు. విజయదశమి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు నింపాలని ఆకాంక్షించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


