అర్హులైన వారికీ ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు చేయాలని ప్రజా వాణిలో ఎంపీడీఓ కు వినతిపత్రం

పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు చేయాలి - మండల ప్రధాన కార్యదర్శి సుంకే రమేష్

అర్హులైన వారికీ ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు చేయాలని ప్రజా వాణిలో ఎంపీడీఓ కు వినతిపత్రం

రేగోడ్ (మెదక్ ): రేగోడ్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ళను ఇవ్వడంలో కొందరు పక్షపాతం చూస్తున్నారని అలా కాకుండా పార్టీ లకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్ళను ఇవ్వాలని సోమవారం ప్రజా వాణిలో ఎంపీడీఓ కార్యాలయంలో రేగోడ్ మండల బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు వినతిపత్రం అధికారులకు అందజేశారు. ఈ సందర్బంగా మండల బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సుంకే రమేష్ మాట్లాడుతూ కేవలం వారి పార్టీ కార్యకర్తలకు ఇందిరమ్మ ఇళ్ళను కేటాయించడం మంచి పద్ధతి కాదని అన్నారు.పార్టీలకు అతీతంగా ప్రభుత్వ పథకాలను నిరు పెదలకు చేరేవిదంగా అధికారులు చోరువ చూపాలని,నిజమైన పేదలకు ఇందిరమ్మ ఇళ్ళను మంజూరు చేయాలని అన్నారు. ప్రభుత్వం పైనుండి నిరు పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇవ్వాలని తెలిపిన కూడా కొందరు నాయకులతీరు మండలంలో బాగా లేదని పెద ప్రజలకు కాకుండా ఇల్లు ఉన్న ధనవంతులకు, నాయకులకు ఊడిగం చేసే వాళ్ళకే ఇందిరమ్మ ఇల్లను ఇవ్వడం సమంజసం కాదని అన్నారు. అధికారులు, నాయకుల తీరు మారకుంటే పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహించి ఎక్కడికక్కడ నాయకులను అడ్డుకుంటామని హెచ్చరించారు. ప్రతి పెదవారికీ న్యాయం జరిగే వరకు వారి తరపున బిఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని మండల ప్రజలకు తెలిపారు.ఈ కార్యక్రమంలో రేగోడ్ గ్రామ బిఆర్ఎస్ పార్టీ అధ్యకులు రాచోటి సుభాష్,మాజీ సర్పంచ్ సిద్ధారెడ్డి, గ్రామ వార్డు సభ్యులు మరియు మాజీ వార్డు సభ్యులు అమృత్, నాగరాజు, సల్మాన్, సాయిలు, శ్రీనివాస్, రాములు తదితరులు పాల్గొన్నారు.

Views: 30

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

బిజినపల్లి యాదవ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు దసరా శుభాకాంక్షలు బిజినపల్లి యాదవ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు దసరా శుభాకాంక్షలు
బిజినపల్లి(నాగర్ కర్నూల్)బిజినపల్లిలోని యాదవుల ఇంటి ఆడబిడ్డగా కొలిచే చౌడేశ్వరి మాత ఆలయ అభివృద్ధికి సహాయ సహకారాలందించినందుకుబిజినపల్లి యాదవ సంఘం  ఆధ్వర్యంలో యాదవ సోదరులు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్...
దసరా పండుగ వేళ సొంతగ్రామం కొండారెడ్డిపల్లెకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాక - ఘన స్వాగతానికి ఏర్పాట్లు
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దసరా 
ఎల్ఎన్ఎస్ ప్రభావ నివారణకు యాసంగిలో నీటి పొదుపుపై ప్రత్యేక దృష్టి: జిల్లా వ్యవసాయ అధికారి యశ్వంత్ రావు
రామవరంలో ఘనంగా బతుకమ్మ నిమజ్జనాలు!
ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మమే మిమ్ముల్ని రక్షస్తుంది డా,, అబ్బాగోని 
సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న ‘బేబీ’ హీరోయిన్ వైష్ణవి చైతన్య