అంబర్పేటలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు
72 అడుగుల మహా బతుకమ్మ ప్రత్యేక ఆకర్షణ.. వేలాదిగా తరలివచ్చిన మహిళలు
హైదరాబాద్, అక్టోబర్ 18: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలు అంబర్పేటలో ఘనంగా జరిగాయి. శనివారం (అక్టోబర్ 17) అంబర్పేట మున్సిపల్ గ్రౌండ్లో నిర్వహించిన ఈ వేడుకల్లో వేలాది మంది మహిళలు, చిన్నారులు, వృద్ధులు పాల్గొని బతుకమ్మ పాటలు, సంప్రదాయ నృత్యాలతో సందడి చేశారు.ఈ వేడుకలకు కేంద్ర మంత్రి జి. కిషన్రెడ్డి నాయకత్వం వహించగా, తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గవర్నర్ సతీమణి జానకి శుక్లా, రాజ్యసభ సభ్యుడు డా. కె. లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.ఈ వేడుకల్లో 72 అడుగుల ఎత్తుతో వివిధ రకాల పూలతో పేర్చిన మహా బతుకమ్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారీ పూల బతుకమ్మ చుట్టూ మహిళలు సంప్రదాయ దుస్తుల్లో చేరి పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు.బతుకమ్మ తెలంగాణ సంస్కృతి, మహిళల ఆత్మగౌరవం, ప్రకృతితో మమేకమయ్యే సంప్రదాయానికి ప్రతీక అని కిషన్రెడ్డి పేర్కొన్నారు. తరతరాలుగా వస్తున్న ఈ పండుగను భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.గవర్నర్ శివప్రతాప్ శుక్లా మాట్లాడుతూ తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకుంటూనే ఆధునికతను స్వాగతించాలని పిలుపునిచ్చారు. నీటి సంరక్షణకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.అంబర్పేటలో జరిగిన ఈ వేడుకలు తెలంగాణ పూల పండుగ వైభవాన్ని మరోసారి చాటిచెప్పాయి.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


