ఎన్ఎస్ఎస్ నిధుల దుర్వినియోగంపై పాలమూరు వర్సిటీ ఆగ్రహం

విశ్వ వికాస్ డిగ్రీ కళాశాలకు నోటీసులు - వెంటనే ఖాతా మూసివేయాలని ఆదేశం

ఎన్ఎస్ఎస్ నిధుల దుర్వినియోగంపై పాలమూరు వర్సిటీ ఆగ్రహం

ఎన్ఎస్ఎస్ నిధులను ఇతర అవసరాలకు వినియోగించడంపై అభ్యంతరం

నాగర్‌కర్నూల్ : ఎన్ఎస్ఎస్ నిధులను కళాశాల యాజమాన్యం దుర్వినియోగం చేసిందన్న అంశంలో పాలమూరు విశ్వవిద్యాలయం జిల్లా కేంద్రంలోని విశ్వ వికాస్ డిగ్రీ కళాశాల యాజమాన్యానికి నోటీసులు జారీ చేసింది. కళాశాల నిర్వహిస్తున్న ఎన్ఎస్ఎస్ యూనిట్ బ్యాంకు ఖాతా ద్వారా సిబ్బంది జీతాలు, పరీక్ష ఫీజులు, విద్యార్థుల ఫీజుల రీయింబర్స్‌మెంట్, యాజమాన్య నిధుల బదిలీలు, దోస్త్ అడ్మిషన్లకు సంబంధించిన లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు నోటీసులో పేర్కొంది. నిబంధనలను అతిక్రమిస్తూ దోస్త్ అడ్మిషన్లకు సంబంధించిన లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు నోటీసులో పేర్కొంది. ఎన్ఎస్ఎస్ లక్ష్యాలకు విరుద్ధంగా ఖాతాను వినియోగించడం నిబంధనలకు వ్యతిరేకమని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఎన్ఎస్ఎస్ యూనిట్ బ్యాంకు ఖాతాను తక్షణమే మూసివేయాలని ఆదేశించినట్లు నోటీసులో పేర్కొన్నారు. ఆదేశాలను పాటించక, ఉల్లంఘించినా సంబంధిత నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.ఈ నెల 27న పాలమూరు విశ్వవిద్యాలయం ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ జారీ చేసిన నోటీసులో ఈ విషయాలను పేర్కొంటూ తక్షణ అమలుకు ఆదేశించారు. ఇది ఇలా ఉండగా కళాశాల యాజమాన్యం భారీగా అవకతవకలకు పాల్పడినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Views: 4

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

చౌటకూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కథక్ నృత్య ప్రదర్శన చౌటకూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కథక్ నృత్య ప్రదర్శన
చౌటకూర్ : విద్యార్థుల్లో భారతీయ సంప్రదాయ కళలు, సంస్కృతి పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు ‘స్పిక్ మెకే’ సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం సంగారెడ్డి జిల్లా చౌటకూర్ జిల్లా పరిషత్...
అల్లాదుర్గంలో ట్రాన్స్ఫార్మ్ ను కప్పేసిన తీగలు
దీపావళి బాణసంచా విక్రయాలకు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలి
విద్యార్థుల పై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి
ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే పోచారం.
బాన్సువాడ నియోజకవర్గాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలి
మున్సిపల్ అధికారులకు జీహెచ్ఎంసీ–ఏఎస్సీఐ ఆధ్వర్యంలో సామర్థ్య అభివృద్ధి కార్యక్రమం