ఓట్ బచావో – దేశ్ బచావో సభకు మక్తల్ నుంచి కాంగ్రెస్ శ్రేణుల తరలింపు

ఢిల్లీ నిరసన సభకు బయలు దేరిన కాంగ్రెస్ శ్రేణులు, బస్సులకు జెండా ఊపిన మంత్రి వాకిటి శ్రీహరి

ఓట్ బచావో – దేశ్ బచావో సభకు మక్తల్ నుంచి కాంగ్రెస్ శ్రేణుల తరలింపు

మక్తల్ :  ఓట్ బచావో – దేశ్ బచావో కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నవంబర్ 1న ఢిల్లీలో నిర్వహించనున్న భారీ నిరసన సభకు మంత్రి వాకిటి శ్రీహరి ఇచ్చిన పిలుపు మేరకు మక్తల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో బయలుదేరారు. మక్తల్ నుంచి ఢిల్లీకి వెళ్లేందుకు ఏర్పాటు చేసిన బస్సులను మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి స్వయంగా కార్యకర్తలతో కలిసి బస్సులో ప్రయాణిస్తూ నినాదాలు చేశారు. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతూ వారిలో జోష్ పెంచారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు సంరక్షణ లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి పునాది అని, ప్రతి పౌరుడి ఓటు హక్కును కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. ఢిల్లీ నిరసన సభను విజయవంతం చేసేందుకు మక్తల్ నియోజకవర్గం నుంచి నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా తరలివెళ్లారు.

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలో  రాణించాలి విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలో రాణించాలి
మక్తల్ :  తెలంగాణ రాష్ట్ర టెన్నికాయిట్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు రాకేష్ అగర్వాల్, పిఎన్. వెంకటేష్ ఆదేశాల మేరకు, నారాయణపేట జిల్లా టెన్నికాయిట్ అసోసియేషన్  ఆధ్వర్యంలో ఈ...
నవంబర్ 5నుండి కేంద్రమంత్రి బండి సంజయ్ మహా పాదయాత్రను విజయవంతం చేయాలి
ఓట్ బచావో – దేశ్ బచావో సభకు మక్తల్ నుంచి కాంగ్రెస్ శ్రేణుల తరలింపు
వట్టెం గ్రామంలో ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై అవగాహన కల్పించిన సర్పంచ్ జ్యోతి శంకర్ మరియు బీజేపీ మండల నాయకులు
టీజీఎస్nఆర్టీసీ రీజియన్లో రోడ్డు భద్రత ప్రమాదాల నివారణపై శిక్షణ కార్యక్రమం
ఫత్లాపూర్‌లో పౌర హక్కుల దినోత్సవం
స్క్రాప్ దుకాణం ప్రారంభించిన పాలకుర్తి సారంగపాణి