బిజినపల్లి రోడ్డు ప్రమాద కేసులో తీర్పు - ఎస్‌ఐలు వీరబాబు, షంషుద్దీన్, సీఐ అశోక్ రెడ్డిలకు అడిషనల్ ఎస్పీ అభినందన
9 ఏళ్ల నాటి కేసులో నిందితుడికి 3 నెలల జైలు శిక్ష,రూ.1000జరిమానా
బిజినపల్లి (నాగర్ కర్నూల్)
నాగర్ కర్నూల్ జిల్లాలో 9 ఏళ్ల నాటి రోడ్డు ప్రమాద కేసులో నిందితుడికి జైలు శిక్ష పడింది. 2016లో బిజినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన క్రైమ్ నంబర్ 64/2016 కేసులో నాగర్ కర్నూల్ జిల్లా కోర్టు తీర్పు వెలువరించింది. ఐపీసీ 304-A, 338 సెక్షన్ల కింద నమోదైన ఈ కేసులో రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, మరో నలుగురికి గాయాలయ్యాయి. ఈ కేసులో నిందితుడిగా ఉన్న పెంట్లవెల్లి గ్రామానికి చెందిన జహంగీర్‌కు కోర్టు మూడు నెలల జైలు శిక్షతో పాటు రూ.1,000 జరిమానా విధించింది. ఈ కేసులో నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన పోలీసు అధికారులను జిల్లా అడిషనల్ ఎస్పీ వెంకటేశ్వర్లు అభినందించారు. కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన ఎస్‌ఐలు వీరబాబు, రాంబాబు, ప్రస్తుత ఎస్‌ఐ షంషుద్దీన్, సీఐ అశోక్ రెడ్డి, కోర్టు కానిస్టేబుళ్లు రమేష్, ఆంజనేయుల కృషిని ప్రశంసించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


