మునిపల్లి మండలాన్ని*కరువు* *ప్రాంతంగా ప్రకటించాలి! రైతులకు నష్టపరిహారం*ఎకరానికి 25,000 *అందించాలి
18 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా ఇవ్వాలి!
సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం పిఎస్ఆర్ గార్డెన్ లో సర్పంచులు స్థానిక నాయకులతో కలిసి సమావేశంలో
బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు
పైతర సాయికుమార్ మాట్లాడుతూ
మునిపల్లి మండల పరిధిలోని రైతులు ప్రస్తుతం వ్యవసాయ సంక్షోభం ఎలినెనో ప్రభావం ఎదుర్కొంటున్నారు. మండలంలో ప్రధాన పంటలైన పత్తి, చెరుకు, మిర్చి పంటలు ప్రతికూల పరిస్థితుల కారణంగా తీవ్రంగా దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు.పంటల సాగు కోసం పెట్టుబడులు పెట్టిన రైతులు, ఆశించిన దిగుబడులు రాక ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి నెలకొంది.నాణ్యమైన 18 గంటల విద్యుత్ సరఫరా చేయాలి!
వ్యవసాయానికి అవసరమైన విద్యుత్ సక్రమంగా సరఫరా కాకపోవడంతో రైతులు
తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.రోజుకు కేవలం నాలుగు నుంచి ఐదు గంటల పాటు మాత్రమే విద్యుత్ అందుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విద్యుత్ కోతలతో పంటలకు సకాలంలో నీరు అందించలేకపోతునాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి వ్యవసాయానికి 18 గంటల నిరంతరాయ, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.పంట నష్టపరిహారం కింద తక్షణమే పరిహారం ఎకరానికి 25000 అందించాలి.
ముఖ్యంగా మిర్చి, చెరుకు పంటలకు నష్టం వాటిల్లిన రైతులను ప్రభుత్వం తక్షణమే గుర్తించి, క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించి, అర్హులైన రైతులకు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేస్తున్నాం. రైతుబంధు నిధులు వెంటనే విడుదల చేయాలి!
రబీ సీజన్ ముగింపు దశకు చేరుకుంటున్నప్పటికీ రైతుబంధు పెట్టుబడి సాయం అందకపోవడం రైతులకు ఆర్థిక భారంగా మారుతోంది.ఇప్పటికే సాగు పెట్టుబడుల కోసం అప్పులు చేసిన రైతులు మరింత ఇబ్బందులకు గురవుతున్నారు. మునిపల్లి మండలాన్ని*కరువు *ప్రాంతంగా ప్రకటించాలి!
మండలంలోని వ్యవసాయ పరిస్థితులను ప్రభుత్వం తక్షణమే సమీక్షించి, పంటల నష్టం, సాగునీటి కొరత, విద్యుత్ సమస్యలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి
రైతుల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే స్పందించాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.రైతుల కష్టాలను గుర్తించి, వారి పంటలను కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి. రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోకుండా, వ్యవసాయాన్ని కొనసాగించగలిగేలా ప్రభుత్వం అండగా నిలవాలిని
ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.ఈకార్యక్రమంలో మునిపల్లి మండల
తాజా మాజీ జెడ్పిటిసి
పైతర మీనాక్షి సాయికుమార్
ఎక్స్ ఎంపీపీ చంద్రయ్య
మండల నాయకులు మంతూరి శశికుమార్, బండారి పాండు,సర్పంచులు,ఇర్ఫాన్ పటేల్
విట్టల్
మల్లేశం
రమేష్
సంగమేశ్వర్
దయానంద్,
రాజు,నాయకులు
గడ్డం భాస్కర్
గడ్డం భాస్కర్
మాజీ సర్పంచులు
పైతర మొగులయ్య
గోపులారం బాగయ్య
గోపులారం బక్కన్న
గార్లపల్లి శంకరయ్య
మేల సంఘం శ్రీనివాస్,చీలపల్లి మౌలానా
తుడుం దుర్గయ్య
తదితరులు పాల్గొన్నారు
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

