కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత..

కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రిగా చూడాలన్నదే ప్రజల ఆకాంక్ష కేటీఆర్ సభకు అంచనాలకు మించి ప్రజలు తరలిరానున్నారు ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, మాజీ శాసనసభ్యులు దాస్యం వినయ్ భాస్కర్

కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత..


హనుమకొండ న్యూస్ : నవంబర్ 22న ఆదివారం రోజున కేడీసీ గ్రౌండ్ లో నిర్వహించనున్న జన చైతన్య సభ నేపథ్యంలో సభా స్థలిని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీ, మాజీ చైర్మన్లు, మాజీ కార్పొరేటర్లతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, మాజీ శాసనసభ్యులు దాస్యం వినయ్ భాస్కర్  మాట్లాడుతూ 
సభకు సుమారు 20 వేల మంది వస్తారని తొలుత అంచనా వేసినప్పటికీ, ప్రజల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే అంతకుమించిన స్థాయిలో జనసమీకరణ జరిగే అవకాశం ఉందన్నారు.కేటీఆర్ ప్రసంగాన్ని వినేందుకు వేలాదిగా ప్రజలు తరలిరానున్నారని, సభా ప్రాంగణం కూడా సరిపోని పరిస్థితి ఏర్పడవచ్చని అభిప్రాయపడ్డారు.ఇతర పార్టీలకు చెందిన నాయకులతో పాటు వివిధ రంగాలకు చెందిన మేధావులు, పలువురు ప్రముఖులు బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు వెల్లడించారు.గత మూడేళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఇచ్చిన 420 హామీల్లో ఏ ఒక్కటీ పూర్తిస్థాయిలో అమలు కాలేదని విమర్శించారు. 
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా కేసీఆర్ పదేళ్ల పాలనలో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేశారని గుర్తుచేశారు. 
ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న కాంగ్రెస్ పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని అన్నారు.
ప్రజా సమస్యలపై ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ నిరంతరం పోరాటం చేస్తుందని, గులాబీ సైనికులుగా ప్రజల పక్షాన నిలుస్తామని స్పష్టం చేశారు. 
రాబోయే రోజుల్లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కేసీఆర్‌ను తిరిగి ముఖ్యమంత్రిగా చూడాలన్నదే ప్రజల ఆకాంక్షగా ఉందని పేర్కొన్నారు. 
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బీఆర్ఎస్ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తుందని తెలిపారు.
మాజీ శాసనసభ్యులు ఆరూరి రమేష్ మాట్లాడుతూ 
ప్రజలను చైతన్యపరిచేందుకే జన చైతన్య సభ
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం
గతంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే అభయహస్తం హామీలను అమలు చేస్తామని ప్రకటించారని గుర్తుచేశారు. అయితే మూడేళ్ల పాలన పూర్తవుతున్నా హామీల అమలులో ఆశించిన పురోగతి లేదని విమర్శించారు. ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం రాజకీయ విమర్శలు, వ్యక్తిగత దూషణలకు ప్రాధాన్యత ఇస్తోందని ఆరోపించారు.తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న అనంతరం ఉద్యమ నాయకుడు కేసీఆర్ పదేళ్లపాటు అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించడంతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయాయని, గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను రద్దు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు.రాష్ట్రానికి తిరిగి పూర్వవైభవం రావాలంటే కేసీఆర్ నాయకత్వం అవసరమని, ప్రజల్లో రాజకీయ చైతన్యం తీసుకురావడమే జన చైతన్య సభ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ సభలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, మేధావులు, విద్యావేత్తలు బీఆర్ఎస్‌లో చేరనున్నారని వెల్లడించారు.
కార్మికులు, కర్షకులు, యువత, మేధావులు, విద్యావేత్తలు, పత్రికా మిత్రులు పెద్ద సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్‌లో నాయకులు, ఎమ్మెల్యేలే అసంతృప్తితో ఉన్నారు
ప్రజా సమస్యలను పరిష్కరించడంలో రేవంత్ ప్రభుత్వం విఫలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తన పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలను కాపాడుకునే పరిస్థితి కూడా లేదని, రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత అసంతృప్తి నెలకొందని విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు, మేధావులు బీఆర్ఎస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుత పాలనపై ప్రజలతో పాటు అధికార పార్టీ నాయకుల్లోనూ అసంతృప్తి వ్యక్తమవుతోందని పేర్కొన్నారు.
రైతులు సాగునీరు, విద్యుత్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, పట్టణ ప్రాంతాల్లో తాగునీరు, విద్యుత్ సమస్యలు తలెత్తుతున్నాయని ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను కొనసాగించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు.
420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటి అమలులో విఫలమైందని, కనీసం గత ప్రభుత్వం అమలు చేసిన రైతు, ప్రజా సంక్షేమ పథకాలనైనా కొనసాగించి ప్రజలకు మేలు చేయాలని హితవు పలికారు.ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాస్తవ పరిస్థితులను గుర్తించి రైతులు, పట్టణ ప్రజల సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని సూచించారు. కేటీఆర్ సభకు పార్టీ కార్యకర్తలు, నాయకులు, పట్టణ ప్రజలు, వివిధ రంగాల మేధావులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.మాజీ పార్లమెంట్ సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్  మాట్లాడుతూ 
తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన వరంగల్... అదే స్ఫూర్తితో కేటీఆర్ సభ.. తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో వరంగల్ నగరానికి ప్రత్యేక స్థానం ఉందని, ఉద్యమానికి నగరం ఎప్పుడూ అండగా నిలిచిందని గుర్తుచేశారు. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమానికి నూతన ఉత్తేజాన్ని అందించిన ఇదే ప్రాంగణంలో ఆదివారం కేటీఆర్ బహిరంగ సభ నిర్వహించనున్న నేపథ్యంలో ఆనాటి ఉద్యమ జ్ఞాపకాలను పంచుకున్నారు.2001 ఏప్రిల్ 27న గులాబీ జెండా ఆవిష్కరణ అనంతరం కరీంనగర్‌లో నిర్వహించిన సభతో తెలంగాణ ఉద్యమ ప్రస్థానం ప్రారంభమైందని తెలిపారు. అనంతరం వివిధ రాజకీయ పరిణామాల నేపథ్యంలో వరంగల్‌లో నిర్వహించిన సభలు కూడా ఉద్యమానికి ఎంతో ఊపునిచ్చాయని గుర్తుచేశారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఢిల్లీలో కేసీఆర్‌తో పాటు తాము పార్లమెంట్ సభ్యులుగా ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ఎదురైన ఆటుపోట్లలో వరంగల్ నగరానికి వచ్చి స్థానిక నాయకులు, మేధావులు, పత్రికా ప్రతినిధులతో చర్చించేవారమని తెలిపారు. 
వారి అభిప్రాయాలు, మద్దతు కేసీఆర్‌కు నూతన ఉత్సాహాన్ని అందించేవని పేర్కొన్నారు.
వరంగల్ నగర ప్రజలు, రాజకీయ నాయకులు, మేధావులు తెలంగాణ ఉద్యమానికి అందించిన సహకారం మరువలేనిదన్నారు. అదే చారిత్రక ప్రాధాన్యత కలిగిన ప్రాంగణంలో ఇప్పుడు కేటీఆర్ సభ జరగడం విశేషమని పేర్కొన్నారు.
ఈ సభకు వరంగల్ నగరానికి చెందిన పలువురు ప్రముఖులు, వివిధ పార్టీల నాయకులు బీఆర్ఎస్‌లో చేరేందుకు సిద్ధమవుతున్నారని వెల్లడించారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని మరోసారి చాటేలా సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్‌లో అంతర్గత అసంతృప్తి.. ప్రభుత్వ భవిష్యత్తుపై అనిశ్చితి
సామాన్య ప్రజలే కాదు.. సొంత పార్టీ నాయకులూ ప్రభుత్వ తీరుపై అసంతృప్తితో ఉన్నారు
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై సామాన్య ప్రజలతో పాటు సొంత పార్టీ నాయకులు, మంత్రులు, శాసనసభ్యులు సైతం అసంతృప్తితో ఉన్నారని బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు పెరుగుతున్నాయని, ఆ పార్టీలో నెలకొన్న పరిణామాలు ప్రభుత్వ భవిష్యత్తుపై అనేక సందేహాలకు తావిస్తున్నాయని వ్యాఖ్యానించారు.కాంగ్రెస్ పార్టీలో రెండు వర్గాలు ఏర్పడ్డాయని, ఒక వర్గం ప్రభుత్వ విధానాలపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తోందని ఆరోపించారు. మీడియాలో కనిపిస్తున్న అసమ్మతి స్వరాల కంటే పార్టీలో అంతర్గతంగా ఉన్న అసంతృప్తి మరింత ఎక్కువగా ఉందని పేర్కొన్నారు.
ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు తాము ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదని, కాంగ్రెస్‌లోని అంతర్గత పరిణామాలే ఆ పార్టీకి సమస్యగా మారాయని అన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలైనా చోటుచేసుకోవచ్చని అభిప్రాయపడ్డారు.కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని, గతంలో కేసీఆర్ నాయకత్వంలో అమలైన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు గుర్తుచేసుకుంటున్నారని తెలిపారు. తిరిగి కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి రాష్ట్రానికి పూర్వవైభవం తీసుకురావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని పేర్కొన్నారు.
రేపు నిర్వహించనున్న కేటీఆర్ జన చైతన్య సభ ఈ రాజకీయ ప్రయాణంలో ఒక ముందడుగు మాత్రమేనని, రానున్న రోజుల్లో మరిన్ని సభలు నిర్వహించి ప్రజా సమస్యలపై పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

Views: 5

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

సనాతన ధర్మ సహస్ర సూత్రాలు హిందీ గ్రంథ ఆవిష్కరణ సనాతన ధర్మ సహస్ర సూత్రాలు హిందీ గ్రంథ ఆవిష్కరణ
భువనగిరి :  రమణేశ్వరంలో ‘సనాతన ధర్మ సహస్ర సూత్రాలు’ హిందీ గ్రంథావిష్కరణ వేదాలు, ఉపనిషత్తులు, స్మృతులలోని జ్ఞానాన్ని స్వీయ ఆధ్యాత్మిక అనుభూతులతో మేళవించి సిద్ధగురు శ్రీ రమణానంద...
పట్టణాల అభివృద్ధికి రూ.20 వేల కోట్లు.. స్వాగతం
హెచ్ఐవి నియంత్రణలో జిల్లాకు సురక్షిత గుర్తింపు
ఆధ్యాత్మికతతో శాంతిని నెలకోల్పాలి
59వ గ్రంథాలయ వారోత్సవాల్లో బిట్స్ జయకేతనం
మద్యం మత్తులో పొలంలో పడి వ్యక్తి మృతి
జీవితభీమా పధకానికి నమోదు చేసుకోవాలి