ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన – వక్తల హర్షం

ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

నాంపల్లి మండల కేంద్రంలో ఆదివారం సాయంత్రం తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. మాజీ కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు కొమ్ము బిక్షం ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ముఖ్యమంత్రి జన్మదినాన్ని ఉత్సాహంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం అయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ పాలన సాగిస్తోందని అన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సకాలంలో అందించేందుకు కృషి చేస్తోందని హర్షం వ్యక్తం చేశారు.పేద, మధ్యతరగతి కుటుంబాల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని, రైతులు, మహిళలు, విద్యార్థులు, నిరుపేదలకు ప్రభుత్వ పథకాల ద్వారా ప్రయోజనం చేకూరుతోందని పేర్కొన్నారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరింత సమర్థవంతంగా పాలన కొనసాగిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవిస్తూ ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు ఆకాంక్షించారు. వేడుకలతో నాంపల్లి మండల కేంద్రంలో సందడి నెలకొంది. ఈ కార్యక్రమంలో నాంపల్లి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు పానగంటి వెంకటయ్య గౌడ్, అమరవీరుల ఆశయ సాధన కమిటీ సభ్యులు కోరే సాయిరాం, పార్టీ కార్యకర్తలు,అభిమానులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Views: 47

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

సనాతన ధర్మ సహస్ర సూత్రాలు హిందీ గ్రంథ ఆవిష్కరణ సనాతన ధర్మ సహస్ర సూత్రాలు హిందీ గ్రంథ ఆవిష్కరణ
భువనగిరి :  రమణేశ్వరంలో ‘సనాతన ధర్మ సహస్ర సూత్రాలు’ హిందీ గ్రంథావిష్కరణ వేదాలు, ఉపనిషత్తులు, స్మృతులలోని జ్ఞానాన్ని స్వీయ ఆధ్యాత్మిక అనుభూతులతో మేళవించి సిద్ధగురు శ్రీ రమణానంద...
పట్టణాల అభివృద్ధికి రూ.20 వేల కోట్లు.. స్వాగతం
హెచ్ఐవి నియంత్రణలో జిల్లాకు సురక్షిత గుర్తింపు
ఆధ్యాత్మికతతో శాంతిని నెలకోల్పాలి
59వ గ్రంథాలయ వారోత్సవాల్లో బిట్స్ జయకేతనం
మద్యం మత్తులో పొలంలో పడి వ్యక్తి మృతి
జీవితభీమా పధకానికి నమోదు చేసుకోవాలి