బాల్కొండ నియోజక వర్గంలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబురాలు

బాల్కొండ (నిజామాబాదు జిల్లా): నిజామాబాదు జిల్లా బాల్కొండ నియోజక వర్గంలోని అనేక గ్రామాల్లోని ఉన్నత పాఠశాలలు, జూనియర్ కళాశాలల విద్యార్థిని విద్యార్థులు బతుకమ్మ సంబరాలు అత్యంత వైభ వంగా, ఉత్సాహ భరితవాతా వరణంలో నిర్వహించారు. బాల్కొండ లోని జిల్లా పరిషద్, శాoభవి, నవీన్ విద్య నీకేతన్, శ్రీ వెంకటే శ్వర,మదర్ థెరిసా ఉన్నత పాఠశాల్లోని విద్యార్థిని విద్యార్థులతో బతుకమ్మ ఆడుతూ పూర వీధుల్లో ఊరేగించారు.తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకల్లో విద్యార్థినీ, విద్యార్థులు,ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు, ఉత్సా హంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రకృతిలో సహజంగా లభించే గునుగు, తంగేడు, బంతి, చామంతి తదితర రంగు రంగుల పూలను సేకరించి, అందమైన బతుకమ్మలను రూపొందించారు.సంప్రదాయ దుస్తుల్లో ముస్తాబైన విద్యార్థినులు బతుకమ్మల చుట్టూ తిరుగుతూ జానపద గీతాలు ఆలపిస్తూ, చప్పట్లతో ఆడిన ఆటపాటలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఈ సందర్భంగా పాఠశాలాల కరెస్పిండెంట్స్ రామ లక్ష్మి సుబ్బారెడ్డి,మాట్లాడుతూ, బతుకమ్మ పండుగ తెలంగాణ మహిళల ఆత్మగౌరవానికి, ప్రకృతి ఆరాధనకు, సాంస్కృ తిక వైభవానికి ప్రతీక అని పేర్కొన్నారు. ఇటువంటి పండుగల నిర్వహణ ద్వారా విద్యార్థుల్లో మన సంస్కృతి, సంప్రదాయాల పట్ల గౌరవం పెంపొందించడంతో పాటు ప్రకృతి పరిరక్షణ, పర్యావరణ స్పృహ, సామాజిక ఐక్యత వంటి విలువలు అలవడ తాయని తెలిపారు. పూలతో ప్రకృతిని పూజించే బతుకమ్మ పండుగ విశిష్టతను విద్యార్థుల కు వివరించి, మన తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలియజేశారు. ఈ కార్యక్ర మంలో పాఠశాల సంబంధిత ప్రధానోపాధ్యాయులు నర్సింహా రెడ్డి, సీనియర్ హైమద్ ఉపాధ్యాయినీ, ఉపాధ్యా యులు, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొని బతుకమ్మ సంబరాల ను విజయవంతం చేశారు. పాఠశాల ప్రాంగణ మంతా రంగురంగుల బతుకమ్మలు, జానపద గీతాలు, విద్యార్థుల ఆనందోత్సాహాలతో పండుగ శోభను సంతరించుకుంది.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


