మూగజీవాలతో రోడ్డు ప్రమాదాలు
మృత్యుపాశంగా నాగార్జునసాగర్ ప్రధాన రహాదారి
పశుపోషకులను హెచ్చరిస్తున్న పోలీసులు
వాహనధారులకు పలు సూచనలు
త్రిపురారం, : హాలియా నుండి మిర్యాలగూడ వైపు వెళ్లే నాగార్జునసాగర్ ప్రధాన రహాదారి మృత్యుపాశంగా మారింది. రోడ్డుపై విచ్చలవిడిగా పశువులు, మూగజీవాలు సంచరిస్తుండడంతో వాహనదారులు ప్రమాదాలకు గురి అవుతూ ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో త్రిపురారం పోలీసులు మూగజీవాలను రోడ్డుపై వదిలే పశు పోషకులను తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. వాహనదారులు సైతం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ప్రమాదాలు జరుగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై త్రిపురారం ఎస్ఐ కైగూరి నరేష్ వాహనదారులు, పశు పోషకులకు పలు సూచనలు చేస్తున్నారు. పశుపోషకులు పాటించాల్సిన నిబంధనలు. పశువులు, మూగజీవాలు జాతీయ రహాదారిపైకి రాకుండా చూసుకోవాలి. రహాదారులకు సమీపంలో పశువులు మేపేటప్పుడు పశువుల రోడ్లపైకి ఎక్కకుండా జాగ్రత్తపడాలి. పశుపోషకులు దగ్గరుండి తమ పశువులను మేపుకోవాలి. పశుపోషకులు ఈ విధమైన నిబంధనలు పాటిస్తేనే వాహనధారులు రోడ్డు ప్రమాదాల భారిన పడకుండా కాపాడవచ్చు. వాహానధారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. మండలకేంద్ర శివారులో ఉన్న రైస్ మిల్లు వద్ద వాహానధారులు తమ వాహానాలను నిదానంగా నడపాలి. పశువులు, మూగజీవాలు అకస్మాత్తుగా రోడ్డుపైకి వచ్చే అవకాశం ఉన్నందున వాహనదారులు సైతం చాలా అప్రమత్తంగా ఉండాలి. వేగ నియంత్రణ పాటిస్తూ రోడ్డుపై పశువులను, మూగజీవాలను గమనిస్తూ తమ వాహానాలను నడపాలి.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


