బొమ్మనపల్లి లో విషాదం
విద్యుత్తు లైన్ తెగిపడి గ్రామపంచాయతీ వర్కర్ మృతి మృతుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్
అచ్చంపేట ;.(నాగర్ కర్నూల్ జిల్లా) : ప్రమాదవశాత్తు విద్యుత్తు లైన్ తెగిపడి వ్యక్తి మృతి చెందిన సంఘటన నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలంలోని బొమ్మనపల్లి గ్రామంలో చోటుచేసుకుంది స్థానిక గ్రామపంచాయతీలో మల్టీపర్పస్ వర్కర్ గా పనిచేస్తున్న సౌటా బాలయ్య(45) గత ఎనిమిది సంవత్సరాల నుంచి గ్రామపంచాయతీ లో వర్కర్ గా పనిచేస్తున్నాడు విధి నిర్వహణలో భాగంగా గ్రామంలో చెట్లను తొలగిస్తుండగా ఎల్టిలైన్ తెగిపడి బాలయ్య అక్కడికక్కడే మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు గతంలో విద్యుత్ వైర్లు చెట్లకు తగిలి ప్రమాదంగా ఉన్నదని సంబంధిత విద్యుత్ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని గ్రామస్తులు తెలిపారు విద్యుత్ షాక్కు తగిలిన వెంబడే బాలయ్యను హాస్పిటల్కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపినట్లు గ్రామస్తులు తెలిపారు సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని బాలయ్య మృతికి గల కారణాలను పంచనామ నిర్వహించారు మృతునికి భార్యాపిల్లలు ఉన్నారు గ్రామ మాజీ సర్పంచ్ బోట్క నాయక్ మాజీ ఎంపిటిసి మృతుని కుటుంబాన్ని పరామర్శించి బాలయ్య కుటుంబానికి 15 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


