సీఎం సభకు ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ
ప్రజలకు నీటి, నీడ సౌకర్యాలు కల్పించాలని నాయకులకు సూచన
అచ్చంపేట : రేపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విచ్చేస్తున్న సందర్భంగా సభా ఏర్పాట్లను అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ గారు పరిశీలించారు. జనం అనుకున్న దానికన్నా ఎక్కువ వస్తున్నారు కాబట్టి వచ్చిన ప్రజలకు నీటి సౌకర్యం మరియు నీడ వంటి అన్ని సౌకర్యాలు సరిగ్గా చూసుకోవాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కాంగ్రెస్ నాయకులకు, పెద్దలకు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బల్మూర్ మండల్ జిల్లా నాయకులు రాజేందర్, వెంకటరెడ్డి, INTUC తాలూకా అధ్యక్షులు మహబూబ్ అలీ, INTUC పాలమూరు మండల అధ్యక్షులు చందు నాయక్, అచ్చంపేట బీసీ సెల్ నాయకులు తిరుపతి గౌడ్, మైలారం మాజీ సర్పంచ్ శ్రీనివాసులు, అచ్చంపేట మండల INTUC అధ్యక్షులు మౌలానా, సీనియర్ కాంగ్రెస్ నాయకులు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

