కార్తీక మాసం సందర్భంగా శంభు లింగేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు
అర్ధనారీశ్వర రూపంలో దర్శనమిచ్చిన స్వయంభూ శంభు లింగేశ్వర స్వామివారు
లింగాల గణపురం (జనగాం) : జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం కళ్లెం గ్రామంలోని శ్రీ శ్రీ శ్రీ స్వయంభూ శంభు లింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వయంభూ లింగాన్ని పూలతో, కార్తీక దీపాలతో సుందరంగా అలంకరించగా, స్వామివారు అర్ధనారీశ్వర రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకుని, దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు స్వామివారికి రుద్రాభిషేకం, బిల్వార్చన, హారతి కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. కార్తీక మాసంలో పరమశివుడిని దర్శించుకుని పూజలు నిర్వహిస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తులు విశ్వసించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, భక్తులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


