శ్రీ అయ్యప్ప స్వామి దీక్ష భక్తిశ్రద్ధలతో ఆచరించాలి.

.... అఖిలభారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి జిల్లా అధ్యక్షులు డాక్టరేట్ కాకర్ల భీమయ్య

శ్రీ అయ్యప్ప స్వామి దీక్ష భక్తిశ్రద్ధలతో ఆచరించాలి.

నారాయణపేట : హరిహరపుత్రుడు శ్రీ అయ్యప్ప స్వామి మాలధారణ చేపట్టిన భక్తులు దీక్షా నియమ నిష్ఠలను తూచా తప్పకుండా భక్తిశ్రద్ధలతో ఆచరించాలని అఖిలభారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి జిల్లా అధ్యక్షులు డాక్టరేట్ కాకర్ల భీమయ్య అన్నారు. బుధవారం మోత్కపల్లి బల భీమసేన ఆలయంలో ఆలయ పూజారులు భీమాచార్య శ్రీనివాస్ చేతుల మీదుగా అయ్యప్ప దీక్ష మాలధారణ చేపట్టారు. ఈ సందర్భంగా 30వ పాదం గురుస్వామి డాక్టరేట్ కాకర్ల భీమయ్య మాట్లాడుతూ అయ్యప్ప దీక్ష చేపట్టిన స్వాములు నిత్యం స్వామివారిని స్మరిస్తూ భక్తి, శ్రద్ధలతో పూజలు నిర్వహించాలన్నారు. దీక్షా కాలంలో నియమ నిష్ఠలు, ఆచార వ్యవహారాలను పాటిస్తూ సాత్విక జీవనం సాగించాలని సూచించారు. స్వామి శరణుఘోషతో ఆధ్యాత్మిక భావాలను పెంపొందించుకోవాలని అన్నారు. అయ్యప్ప దీక్ష చేపట్టిన స్వాములు నిత్యం స్వామి వారి నామస్మరణ చేస్తూ క్రమశిక్షణతో దీక్ష నియమాలను పాటించాలని ఆయన స్వాములకు సూచించారు.స్వాములు స్వాత్విక ఆహారం తీసుకుంటూ కోపతాపాలకు దూరంగా ఉంటూ భక్తి భావంతో మండల దీక్షను కొనసాగించాలని తెలిపారు. అంతే కాకుండా ప్రతి వారితో స్వామి అంటే పలుకుతూ చిరునవ్వుతో దీక్ష చేపట్టి స్వామివారికి నిత్యం పూజిస్తూ మండల దీక్షను చేపట్టాలని కోరారు.అయ్యప్ప స్వామి ఆశీస్సులు అందరికీ కలగాలని ఆయన ఆకాంక్షించారు.

Views: 17

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

చౌటకూర్‌లో భక్తి పారవశ్యం.. 299 మంది భక్త బృందంతో 28,807 పార్థివ లింగాల తయారీ! చౌటకూర్‌లో భక్తి పారవశ్యం.. 299 మంది భక్త బృందంతో 28,807 పార్థివ లింగాల తయారీ!
చౌటకూర్, : మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని 2027 మార్చి 6వ తేదీన నిర్వహించనున్న దశకోటి పార్థివ లింగాల మహా సంకల్పంలో భాగంగా, సంగారెడ్డి జిల్లా చౌటకూర్...
గ్రామస్థాయి నుంచి బూత్ స్థాయి వరకు బీజేపీని బలోపేతం చేయాలి : మాజీ ఎంపీ సీతారాం నాయక్
అర్హులందరికీ చేయూత పింఛన్లు - కష్టాల్లో ఉన్న కుటుంబాలకు రూ.5 లక్షల బీమా భరోసా : మంత్రి సీతక్క
తండ రాధమ్మ కుటుంబాన్ని పరామర్శించిన లక్ష్మణ్ బాబు
శ్రీ వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్:
పల్స్ పోలియో కార్యక్రమంలో ప్రోటోకాల్ ఉల్లంఘించారని డిఎం హెచ్ ఓ కు ఫిర్యాదు
సాయిరెడ్డిగూడలో కొనసాగుతున్న ఇందిరమ్మ బీమా నమోదు ప్రక్రియ