వేములవాడ లో విలీనమైన గ్రామ ప్రజలకు ఉపాధి హామీ పథకం వర్తింపజేయాలి:
బోయినపల్లి : రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ పట్టణంలో గౌరవ ఆర్డిఓ కార్యాలయం అధికారి గారికి జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వేములవాడ పట్టణ మున్సిపాలిటీలో విలీనమైన నాంపల్లి, తిప్పాపురం, కోనాయిపల్లి, శా త్రాజ్ పల్లి, అయ్యో ర్ పల్లి, అలాగే పట్టణ ప్రాంతాలైనటువంటి లక్ష్మీపురం, బాలానగర్, హనుమక్క పల్లి, లాలపల్లి తోపాటు వేములవాడ పట్టణ నిరుద్యోగ యువతకు, వ్యవసాయ కూలీలకు, పని లేనటువంటి శ్రామికులకు , కార్మికులకు,జాతీయ ఉపాధి పథకం ను తిరిగి వర్తింపజేసి పని కల్పించాలని డిమాండ్ చేయడం జరుగుతుంది.వేములవాడ నియోజకవర్గం, గౌరవనీయులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చొరవ తీసుకొని ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చి మున్సిపల్ చట్టంతో సంబంధం లేకుండా కొత్త జీవో సవరణ చేసి పట్టణంలో విలీనమైన గ్రామాలకు ప్రజలకు ఉపాధి కల్పించే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని, లేనియెడల పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరిస్తూ ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


