ఈనెల 26 గురువారం రోజున హుస్నాబాద్ పట్టణ దివ్యాంగులకు వృద్ధులకు ఉచిత సహాయ ఉపకరణాల పంపిణీ

వృద్ధులు వికలాంగులు ఇట్టి అవకాశాన్ని వినియోగించుకోవాలని పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వడ్డేపల్లి వెంకటరమణ పిలుపు

ఈనెల 26 గురువారం రోజున హుస్నాబాద్ పట్టణ దివ్యాంగులకు వృద్ధులకు ఉచిత సహాయ ఉపకరణాల పంపిణీ

హుస్నాబాద్ :  సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణ ప్రజలకు పట్టణంలో దివ్యాంగులు వృద్ధులకు ఉచిత సహాయ ఉపకరణాల పంపిణీకి ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఈ నెల 26వ తేది గురువారం రోజునరాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో అలిoకో సంస్థ సహకారంతో నిర్వహిస్తున్నట్లు హుస్నాబాద్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్డేపల్లి వెంకటరమణ తెలిపారు.ఈ శిబిరం ద్వారా అర్హులను గుర్తించి వారికి అవసరమైన కృత్రిమ కాళ్లు,చేతులు, వినికిడి యంత్రాలు, చంక కర్రలు ,చేతి కర్రలు వీల్ చైర్లు , మోటరైజ్డ్ ట్రై సైకిళ్లు తదితర సహాయక ఉపకరణాలను ఉచితంగా అందజేస్తారన్నారు.ఇట్టి అవకాశాన్ని పట్టణంలోని వికలాంగులు వృద్ధులు పెద్ద ఎత్తున పాల్గొని సద్వినిగం చేసుకోవాలని తెలిపారు. దివ్యాంగులు తీసుకురావాల్సిన పత్రాలు ఆధార్ కార్డు జిరాక్స్, రేషన్ కార్డు జిరాక్స్,సదరం సర్టిఫికెట్,UDID కార్డు, పాస్ పోర్ట్ సైజ్ ఫోటో-1,మరియు 60 సం.రాలు పైబడిన వారు, ఆధార్ కార్డు జిరాక్స్,రేషన్ కార్డు జిరాక్స్,పాస్పోర్ట్ సైజ్ ఫోటో,తీసుకొని రాగలని కోరారు.

Views: 31

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

చౌటకూర్‌లో భక్తి పారవశ్యం.. 299 మంది భక్త బృందంతో 28,807 పార్థివ లింగాల తయారీ! చౌటకూర్‌లో భక్తి పారవశ్యం.. 299 మంది భక్త బృందంతో 28,807 పార్థివ లింగాల తయారీ!
చౌటకూర్, : మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని 2027 మార్చి 6వ తేదీన నిర్వహించనున్న దశకోటి పార్థివ లింగాల మహా సంకల్పంలో భాగంగా, సంగారెడ్డి జిల్లా చౌటకూర్...
గ్రామస్థాయి నుంచి బూత్ స్థాయి వరకు బీజేపీని బలోపేతం చేయాలి : మాజీ ఎంపీ సీతారాం నాయక్
అర్హులందరికీ చేయూత పింఛన్లు - కష్టాల్లో ఉన్న కుటుంబాలకు రూ.5 లక్షల బీమా భరోసా : మంత్రి సీతక్క
తండ రాధమ్మ కుటుంబాన్ని పరామర్శించిన లక్ష్మణ్ బాబు
శ్రీ వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్:
పల్స్ పోలియో కార్యక్రమంలో ప్రోటోకాల్ ఉల్లంఘించారని డిఎం హెచ్ ఓ కు ఫిర్యాదు
సాయిరెడ్డిగూడలో కొనసాగుతున్న ఇందిరమ్మ బీమా నమోదు ప్రక్రియ