భూ సర్వే అవగాహన సదస్సు
*కార్యక్రమం నిర్వహించిన తహసిల్దార్, భూ సర్వేయార్ ,పంచాయతీ సెక్రెటరీ కొమురవెల్లి మండల కేంద్రంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి భూ సర్వే లో భాగంగా అవగాహన సదస్సును నిర్వహించడం జరిగింది.రీ సర్వే lo ఎదురయ్యే సమస్యలు సర్వే చేసే విధానం రైతులకు క్లుప్తంగా అర్థమయ్యే విధంగా తహసిల్దార్, భూ సర్వేయర్ రైతులకు వివరించారు. తహసిల్దార్ మాట్లాడుతూ సర్వే జరిగే సమయంలో రైతులు వారికి కేటాయించిన టోకెన్ ప్రకారం ఆయా సమయంలో వారి భూమిలో సర్వేయర్లకు సహకరించాలని కోరారు. ఎలాంటి సమస్యలు ఉన్న సర్వేయర్ల దృష్టికి తీసుకెళ్లాలని తెలిపారు. త్వరలోనే సర్వే తేదీలను ప్రకటిస్తారని , సమాచారం అందిస్తామని తెలిపారు. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా కార్యక్రమాన్ని ప్రారంభించారు. 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాలు రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి కుటుంబం తప్పనిసరిగా ఇట్టి జీవిత బీమాను చేయించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో తాసిల్దార్ దివ్యతో పాటుగా స్పెషల్ ఆఫీసర్, భూ సర్వేయర్, కొమురవెల్లి గ్రామపంచాయతీ సెక్రటరీ కరుణాకర్, గ్రామ సర్పంచ్ ఆంజనేయులు, వార్డ్ మెంబర్లు, గ్రామ రైతులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


