నిరుపేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యం

ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించి లబ్ధిదారుడి కుటుంబానికి శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ రాజర్షి షా

నిరుపేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యం

ఆదిలాబాద్ బ్యూరో  : ప్రతి నిరుపేద కుటుంబానికి సొంతింటి కలను నెరవేర్చడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. పట్టణంలోని నీలా నగర్ కాలనీలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మంజూరైన పసుపుల రాజు నూతన గృహాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ ప్రారంభించి, లబ్ధిదారుడి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ నూతన గృహాన్ని పరిశీలించి, ఇంటి నిర్మాణ నాణ్యత, కల్పించిన వసతులను తనిఖీ చేశారు. ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకుని చక్కటి గృహాన్ని నిర్మించుకున్న లబ్ధిదారుడిని అభినందించారు. జిల్లాలో అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి పక్కా ఇల్లు అందించేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తోందని తెలిపారు. నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా లబ్ధిదారుడు పసుపుల రాజు మాట్లాడుతూ, ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న తమ సొంతింటి కల ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా సాకారమైందని ఆనందం వ్యక్తం చేశారు. తమ కుటుంబానికి అండగా నిలిచిన రాష్ట్ర ప్రభుత్వానికి, సహకరించిన జిల్లా కలెక్టర్‌తో పాటు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జగదీష్ గౌడ్, హౌసింగ్ ఈఈ నాసిర్, స్థానిక ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, కాలనీవాసులు పాల్గొన్నారు.

Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

చౌటకూర్‌లో భక్తి పారవశ్యం.. 299 మంది భక్త బృందంతో 28,807 పార్థివ లింగాల తయారీ! చౌటకూర్‌లో భక్తి పారవశ్యం.. 299 మంది భక్త బృందంతో 28,807 పార్థివ లింగాల తయారీ!
చౌటకూర్, : మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని 2027 మార్చి 6వ తేదీన నిర్వహించనున్న దశకోటి పార్థివ లింగాల మహా సంకల్పంలో భాగంగా, సంగారెడ్డి జిల్లా చౌటకూర్...
గ్రామస్థాయి నుంచి బూత్ స్థాయి వరకు బీజేపీని బలోపేతం చేయాలి : మాజీ ఎంపీ సీతారాం నాయక్
అర్హులందరికీ చేయూత పింఛన్లు - కష్టాల్లో ఉన్న కుటుంబాలకు రూ.5 లక్షల బీమా భరోసా : మంత్రి సీతక్క
తండ రాధమ్మ కుటుంబాన్ని పరామర్శించిన లక్ష్మణ్ బాబు
శ్రీ వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్:
పల్స్ పోలియో కార్యక్రమంలో ప్రోటోకాల్ ఉల్లంఘించారని డిఎం హెచ్ ఓ కు ఫిర్యాదు
సాయిరెడ్డిగూడలో కొనసాగుతున్న ఇందిరమ్మ బీమా నమోదు ప్రక్రియ