ఆపదలో భక్తురాలికి అండగా నిలిచిన మహిళా పోలీసులు
రథోత్సవంలో అపస్మారక స్థితికి చేరుకున్న భక్తురాలికి తక్షణ ప్రథమ చికిత్స సమయస్ఫూర్తితో ప్రాణాపాయం నుంచి కాపాడిన మహిళా కానిస్టేబుళ్లు స్వప్న, రోజా.. అభినందించిన ఎస్పీ
రాజన్న సిరిసిల్ల జిల్లా : ఎల్లారెడ్డిపేటలో మంగళవారం నిర్వహించిన వేణుగోపాల స్వామి రథోత్సవంలో విధులు నిర్వహిస్తున్న మహిళా పోలీసులు మానవత్వాన్ని చాటుకున్నారు. స్వామివారి దర్శనం అనంతరం కొబ్బరికాయ కొట్టే సమయంలో రాజమణి అనే భక్తురాలు ఒక్కసారిగా ఫిట్స్ వచ్చి అపస్మారక స్థితిలో కిందపడిపోయారు. అదే సమయంలో అక్కడ విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుళ్లు స్వప్న, రోజా వెంటనే స్పందించారు. స్థానికుల సహకారంతో భక్తురాలికి తక్షణ ప్రథమ చికిత్స అందించి, ఆమె కోలుకునేలా సహకరించారు. కొద్దిసేపటికే రాజమణి తిరిగి మెలకువలోకి రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విధి నిర్వహణలో అప్రమత్తతతో పాటు మానవతా దృక్పథంతో స్పందించి భక్తురాలికి సకాలంలో సహాయం అందించిన మహిళా కానిస్టేబుళ్లు స్వప్న, రోజాలను జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ప్రత్యేకంగా అభినందించారు. పోలీసుల విధి కేవలం శాంతిభద్రతల పరిరక్షణకే పరిమితం కాదని, ఆపదలో ఉన్న ప్రజలకు అండగా నిలవడం కూడా తమ బాధ్యతేనని ఈ ఘటన చాటిచెప్పింది.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


