రైతు ను రారాజు చేయడం మా లక్ష్యం
బోథ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ సమావేశం రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లెపూల సత్యనారాయణ
,ఆదిలాబాద్ డెస్క్ నవంబర్ 25 బోథ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో పాలకవర్గ సమావేశాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లెపూల సత్యనారాయణ అధ్యక్షతన పాలక వర్గం సమావేశం బుధవారం నిర్వహించారు ఈ సందర్భంగా చైర్మన్ మల్లెపూల సత్యనారాయణ గారు మాట్లాడుతూ రైతు ని రాజు చేయడం మా లక్ష్యం అని రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం ఆలోచిస్తూ ముందుకు సాగుతోందని తెలిపారు. రైతు బాగుంటేనే దేశం బాగుంటుందనే నినాదంతో ప్రభుత్వం పనిచేస్తోందని, జై కిసాన్ అనే నినాదంతో రైతులకు అండగా నిలుస్తున్నామని పేర్కొన్నారు. రైతులు ఎలాంటి నష్టాలకు గురికాకుండా మార్కెట్ కమిటీ నిరంతరం వారి వెన్నంటే ఉంటుందని తెలిపారు. ప్రతిరోజూ పత్తి కొనుగోళ్లు ఆన్ లైన్ విధానంలో పారదర్శకంగా జరుగుతున్నాయని, కొనుగోలు పూర్తయిన వెంటనే మార్కెట్ ఫీజును నిబంధనల ప్రకారం జమ చేస్తున్నామని వివరించారు గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మార్కెట్ ఫీజు ఏడు లక్షల రూపాయలు అధికంగా వసూలైందని తెలిపారు. కరువు ప్రభావంతో పంట దిగుబడులు తగ్గినప్పటికీ, జరిగిన కొనుగోళ్లపై మార్కెట్ ఫీజు వసూలు చేయడం జరిగిందని చెప్పారూ . మార్కెట్ కమిటీ తన పరిధిలో నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తోందని పేర్కొన్నారు. రైతులకు ఎక్కడైనా అన్యాయం జరిగినా, తూకం విషయంలో ఎవరైనా మోసాలకు పాల్పడినా రైతులు వెంటనే మార్కెట్ కమిటీ దృష్టికి తీసుకురావాలని, అటువంటి ఫిర్యాదులపై తగిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎలిటి మోహన్ రెడ్డి మార్కెట్ కమిటీ సభ్యులు జింగాల భోజన్న ఇట్టిడి సత్యనారాయణ రెడ్డి మునీశ్వర్ సోమన్న నడికుంటా అనిత కైలాష్ కుమార్ ఆత్రం నగేష్ మల్లెపూల విజయ్ నందకుమార్ ఎస్ కే యూసఫ్ కైలాస్ మార్కెట్ సిబ్బంది పాల్గొన్నారు
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

