బాల్కొండ లో ఆక్ర మిత గ్రామ పంచాయతీ భూమిని రిటైర్డ్ ఉద్యోగులకు కేటాయించాలని విజ్ఞప్తి

బాల్కొండ లో ఆక్ర మిత గ్రామ పంచాయతీ భూమిని రిటైర్డ్ ఉద్యోగులకు కేటాయించాలని విజ్ఞప్తి

బాల్కొండ (నిజామాబాదు జిల్లా) :- నిజామాబాదు జిల్లా బాల్కొండ భూ కబ్జాలకు పెట్టింది పేరు, కోట్ల విలువ చేసె ప్రభుత్వ భూమి(గ్రామ పంచాయతీ భూమి) కొందరు నాయకులు ఆక్రమించి అక్రమ నిర్మాణం చేస్తున్నారు.ఇట్టి గ్రామ పంచాయతీ ఓపెన్ స్థలాన్ని రిటైర్డ్ ఉద్యోగుల, సినియర్ సీటీజన్స్ భవన నిర్మానానికి కేటాయించాలని రిటైర్డ్ ఉద్యోగుల సంగం, సీనియర్ సిటిజన్స్ సంగం అధ్యక్షులు శ్రీనివాస్,కార్యదర్శ బి. ఆర్. నర్సింగ్ రావు, కలసి నిజామాబాదు జిల్లా కలెక్టర్ ప్రజా వాణి లో లేఖ నేం.తో 07/2026,తేదీ 09 - 11 - 2026 రోజున,అలాగే తెలంగాణ ముఖ్య మంత్రి కార్యాలయంలోని ముఖ్య మంత్రి సహాయ కార్యదర్శి కే. వెంకటేశ్వర్ రావు గారికి లేఖ నేం.తో 07/2026, తేదీ 16-11-2026 రోజున వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ భూమికి సంబదించిన వివరాలు ఇలా ఉన్నాయి.గ్రామ పంచాయతీ కి చెందిన భూమి సర్వే నం 1340 & 1342 లో వెంచర్ చేయడాని పూర్వ గ్రామ పంచాయతీ కార్య నిర్వాహాక అధికారి గులాం మహ్మద్ హయాంలో ఆనాటి గ్రామ పంచాయతీ తీర్మానం తర్వాత బాల్కొండ జీ. పి. లేఖ నేం 78/74,తేదీ10-09-1974, నోట్ ఫైల్ ను పూర్వ జిల్లా కలెక్టర్ బి. కే. పెంటయ్య, ఐ. ఏ. ఎస్, ఎల్. డిస్ / నేం 5853/1974 తేదీ 20-12-1974, ప్రకారంగా వెంచర్ చేసి వేలం పాట ద్వారా ప్లాట్స్ విక్రయించగ రాళ్లతో కూడిన మిగులు భూమిని "ఓపెన్ ప్లేస్ " గ మార్క్ చేసిన స్థలాలను ఉంచారు.ప్రస్తుత గ్రామ పంచాయతీ వారు జిల్లా కలెక్టర్ అనుమతి లేకుండా అధికారం ఉంది కదాని ఇష్టం వచ్చినట్టు " ఫేక్ డాక్యుమెంట్ " సృష్టించి థర్డ్ పార్టీ ద్వారా క్రయ విక్రయాలు జరిపి అదే " ఫేక్ డాక్యుమెంట్ తో " ఫేక్ రిజిస్ట్రేషన్ చేసికొని కోట్లాది రూపాయల విలువ చేసె భూమిలో ఏలా అక్రమ నిర్మాలు చేస్తున్నారో అర్థం కావడం లేదని గ్రామ పౌరులు ఆందోళన చెందు తున్నారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకొని గ్రామ పంచాయతీ ఓపెన్ స్థలo తో పాటు అక్రమ నిర్మాణ స్థలాన్ని స్వాధీనం చేసుకొని సినియర్ సీటీజన్స్ భవన నిర్మాణానికి కేటా యించాలని బాల్కొండ సినియర్ సీటీజన్స్ సభ్యులు కోరుచున్నారు.

Views: 1

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

చౌటకూర్‌లో భక్తి పారవశ్యం.. 299 మంది భక్త బృందంతో 28,807 పార్థివ లింగాల తయారీ! చౌటకూర్‌లో భక్తి పారవశ్యం.. 299 మంది భక్త బృందంతో 28,807 పార్థివ లింగాల తయారీ!
చౌటకూర్, : మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని 2027 మార్చి 6వ తేదీన నిర్వహించనున్న దశకోటి పార్థివ లింగాల మహా సంకల్పంలో భాగంగా, సంగారెడ్డి జిల్లా చౌటకూర్...
గ్రామస్థాయి నుంచి బూత్ స్థాయి వరకు బీజేపీని బలోపేతం చేయాలి : మాజీ ఎంపీ సీతారాం నాయక్
అర్హులందరికీ చేయూత పింఛన్లు - కష్టాల్లో ఉన్న కుటుంబాలకు రూ.5 లక్షల బీమా భరోసా : మంత్రి సీతక్క
తండ రాధమ్మ కుటుంబాన్ని పరామర్శించిన లక్ష్మణ్ బాబు
శ్రీ వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్:
పల్స్ పోలియో కార్యక్రమంలో ప్రోటోకాల్ ఉల్లంఘించారని డిఎం హెచ్ ఓ కు ఫిర్యాదు
సాయిరెడ్డిగూడలో కొనసాగుతున్న ఇందిరమ్మ బీమా నమోదు ప్రక్రియ