​అండర్‌గ్రౌండ్‌లో ఉద్యోగుల భద్రతకు సింగరేణి చేపడుతున్న చర్యలు అభినందనీయం

-​ఆర్కే-7 భూగర్భ గనిని సందర్శించిన మంచిర్యాల ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ నిరోష ,-​గనిలో బొగ్గు ఉత్పత్తి తీరుతెన్నులు, రక్షణ ప్రమాణాల పరిశీలన

​అండర్‌గ్రౌండ్‌లో ఉద్యోగుల భద్రతకు సింగరేణి చేపడుతున్న చర్యలు అభినందనీయం

నస్పూర్(మంచిర్యాల) : దేశానికి వెలుగులు పంచేందుకు చీకటిలో సింగరేణి ఉద్యోగులు పడుతున్న కష్టాన్ని ప్రత్యక్షంగా చూడటం ఒక ప్రత్యేక అనుభూతి అని మంచిర్యాల జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్, సీనియర్ సివిల్ జడ్జి నిరోష అన్నారు. మంగళవారం శ్రీరాంపూర్ ఏరియా పరిధిలోని ఆర్కే-7 భూగర్భ గనిని సందర్శించారు.​గని అధికారులతో కలిసి భూగర్భ గని లోపలికి వెళ్లిన ఆమె, అక్కడి పని ప్రదేశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. బొగ్గు ఉత్పత్తి జరుగుతున్న తీరుతెన్నులు, వివిధ విభాగాల ఉద్యోగుల పనితీరును ఆసక్తిగా గమనించారు. ఈ సందర్భంగా గని వివరాలు, ఉత్పత్తి లక్ష్యాలు, ఉద్యోగుల పని విధానం మరియు ప్రమాదాల నివారణకు యాజమాన్యం తీసుకుంటున్న రక్షణ చర్యలను గని మేనేజర్ జె.తిరుపతి ఆమెకు వివరించారు. ​అనంతరం మెజిస్ట్రేట్ నిరోష మాట్లాడుతూ... అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో చమటోడ్చుతున్న కార్మికుల భద్రతకు సింగరేణి సంస్థ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్న విషయం గని లోపలి పరిస్థితులను చూస్తే స్పష్టమవుతోందని కొనియాడారు. ముఖ్యంగా సేఫ్టీ (రక్షణ) విషయంలో యాజమాన్యం చేపడుతున్న చర్యలు అభినందనీయమని పేర్కొన్నారు. ఆర్కే-7 గనితో పాటు సింగరేణి సంస్థ భవిష్యత్తులో మరింత ప్రగతి సాధించాలని, తద్వారా మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆమె ఆకాంక్షించారు. ​ఈ కార్యక్రమంలో ఆర్కే-7 గని మేనేజర్ జె. తిరుపతి, డిప్యూటీ మేనేజర్ వెంకట్రామ్, సీనియర్ పీఓ సంతన్ తదితర అధికారులు పాల్గొన్నారు.

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

చౌటకూర్‌లో భక్తి పారవశ్యం.. 299 మంది భక్త బృందంతో 28,807 పార్థివ లింగాల తయారీ! చౌటకూర్‌లో భక్తి పారవశ్యం.. 299 మంది భక్త బృందంతో 28,807 పార్థివ లింగాల తయారీ!
చౌటకూర్, : మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని 2027 మార్చి 6వ తేదీన నిర్వహించనున్న దశకోటి పార్థివ లింగాల మహా సంకల్పంలో భాగంగా, సంగారెడ్డి జిల్లా చౌటకూర్...
గ్రామస్థాయి నుంచి బూత్ స్థాయి వరకు బీజేపీని బలోపేతం చేయాలి : మాజీ ఎంపీ సీతారాం నాయక్
అర్హులందరికీ చేయూత పింఛన్లు - కష్టాల్లో ఉన్న కుటుంబాలకు రూ.5 లక్షల బీమా భరోసా : మంత్రి సీతక్క
తండ రాధమ్మ కుటుంబాన్ని పరామర్శించిన లక్ష్మణ్ బాబు
శ్రీ వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్:
పల్స్ పోలియో కార్యక్రమంలో ప్రోటోకాల్ ఉల్లంఘించారని డిఎం హెచ్ ఓ కు ఫిర్యాదు
సాయిరెడ్డిగూడలో కొనసాగుతున్న ఇందిరమ్మ బీమా నమోదు ప్రక్రియ