జింక చర్మాన్ని ఉపయోగిస్తూ పూజల పేరుతో అమాయక భక్తులను మోసం చేస్తున్న వ్యక్తి అరెస్ట్.

నిందితుడి ఇంట్లో జింక చర్మం స్వాధీనం. అటవీ జంతువుల చర్మాలను అక్రమంగా కలిగి ఉండటం చట్టరీత్యా నేరం.*ఆదిలాబాద్ టు టౌన్ ఎస్సై ప్రణయ్

జింక చర్మాన్ని ఉపయోగిస్తూ పూజల పేరుతో అమాయక భక్తులను మోసం చేస్తున్న వ్యక్తి అరెస్ట్.

ఆదిలాబాద్ బ్యూరో  :  ఆదిలాబాద్ పట్టణంలోని రిక్షా కాలనీ, సంజయ్ నగర్‌కు చెందిన జూకంటి గంగాధర్ (45) అనే వ్యక్తి ఇంట్లో ఆదిలాబాద్ టూ టౌన్ పోలీసులు తనిఖీలు నిర్వహించగా జింక చర్మం లభించింది. విచారణలో నిందితుడు గత 20 సంవత్సరాలుగా ఆదిలాబాద్ రూరల్ మండలంలోని అనుకుంట గ్రామ శివ మార్కండేయ మందిరంలో పూజారిగా పనిచేస్తున్నట్లు తెలిపాడు. 2020లో కర్ణాటక అటవీ ప్రాంతంలో ఒక వ్యక్తి వద్ద జింక చర్మాన్ని కొనుగోలు చేసి ఇంటికి తీసుకొచ్చినట్లు వెల్లడించాడు. జింక చర్మంపై కూర్చొని పూజలు చేస్తే దుర్గామాత అనుగ్రహం కలుగుతుందని, భక్తుల సమస్యలను పరిష్కరిస్తానని నమ్మిస్తూ అమాయక ప్రజలను మోసం చేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. ఈ మేరకు గోధుమ రంగులో ఉన్న జింక చర్మాన్ని స్వాధీనం చేసుకొని. నిందితుడిపై చట్ట ప్రకారం కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు.

Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

చౌటకూర్‌లో భక్తి పారవశ్యం.. 299 మంది భక్త బృందంతో 28,807 పార్థివ లింగాల తయారీ! చౌటకూర్‌లో భక్తి పారవశ్యం.. 299 మంది భక్త బృందంతో 28,807 పార్థివ లింగాల తయారీ!
చౌటకూర్, : మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని 2027 మార్చి 6వ తేదీన నిర్వహించనున్న దశకోటి పార్థివ లింగాల మహా సంకల్పంలో భాగంగా, సంగారెడ్డి జిల్లా చౌటకూర్...
గ్రామస్థాయి నుంచి బూత్ స్థాయి వరకు బీజేపీని బలోపేతం చేయాలి : మాజీ ఎంపీ సీతారాం నాయక్
అర్హులందరికీ చేయూత పింఛన్లు - కష్టాల్లో ఉన్న కుటుంబాలకు రూ.5 లక్షల బీమా భరోసా : మంత్రి సీతక్క
తండ రాధమ్మ కుటుంబాన్ని పరామర్శించిన లక్ష్మణ్ బాబు
శ్రీ వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్:
పల్స్ పోలియో కార్యక్రమంలో ప్రోటోకాల్ ఉల్లంఘించారని డిఎం హెచ్ ఓ కు ఫిర్యాదు
సాయిరెడ్డిగూడలో కొనసాగుతున్న ఇందిరమ్మ బీమా నమోదు ప్రక్రియ