బిట్స్ విద్యార్థుల ప్రతిభకు వేదికగా నిలిచిన ఈనాడు ప్రతిభా పాటవ పోటీలు
ములుగు, నవంబర్ 25: చదువుతో పాటు వక్తృత్వంలోనూ తమ సత్తా చాటుతున్నారు ములుగు బిట్స్ విద్యార్థులు. జిల్లా కేంద్రంలోని బాలాజీ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ స్కూల్ (బిట్స్) లో నిర్వహించిన ఈనాడు ప్రతిభా పాటవ పోటీలు విద్యార్థుల ప్రతిభకు వేదికగా నిలిచాయి. ఈ పోటీలలో భాగంగా నిర్వహించిన ఉపన్యాస పోటీలో బిట్స్ విద్యార్థినీ, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వేదికపై భయం లేకుండా నిలబడి, స్పష్టమైన భావాలతో తమ అభిప్రాయాలను వినిపించి అందరి ప్రశంసలు పొందారు. ఈ పోటీలో బి. అక్షిత (9వ తరగతి) ప్రథమ బహుమతి, ఎన్. రిషితాప్రియ (8వ తరగతి) ద్వితీయ బహుమతి, ఎస్. హనీ (9వ తరగతి) తృతీయ బహుమతి సాధించి పాఠశాలకు పేరు తెచ్చారు. విజేతలకు ప్రిన్సిపాల్ బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా బిట్స్ యాజమాన్యం డాక్టర్ ఏ. రాజేంద్ర ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, చిన్న వయసులోనే వేదికపై మాట్లాడే ధైర్యం, నైపుణ్యం అలవర్చుకోవడం విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుందని, విజేతలను అభినందించారు. బిట్స్ ప్రిన్సిపాల్ ఎం.డి. ముజీబ్ మాట్లాడుతూ, విద్యార్థులను అన్ని రంగాలలో ముందుకు తీసుకురావడమే బిట్స్ ప్రధాన లక్ష్యమన్నారు. ఉపన్యాసం వల్ల విద్యార్థుల్లోని భయం తొలగిపోతుందని, భవిష్యత్తులో ఇంటర్వ్యూలు, ఉద్యోగాలు, ఉన్నత స్థానాల్లో రాణించడానికి ఇదే పునాది అవుతుందన్నారు. రాబోవు కాలంలో ఉపన్యాసం కూడా ఒక ఉపాధిగా మారుతుందని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో బిట్స్ విద్యార్థినీ, విద్యార్థులు, ఉపాధ్యాయులు రవికుమార్, దిలీప్, రాజు, రాజేష్, సరస్వతి, సింధు, సుకృత, శ్రీకాంత్, పూర్ణేందర్ పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


