క్యాంప్ ఆఫీస్‌పై దాడికి యత్నించడం దుర్మార్గమైన చర్య: ఎమ్మెల్యే నాయిని…

క్యాంప్ ఆఫీస్‌పై దాడికి యత్నించడం దుర్మార్గమైన చర్య: ఎమ్మెల్యే నాయిని…

హనుమకొండ న్యూస్  :  అభివృద్ధిపై చర్చకు సిద్ధమని సవాల్ విసిరితే, చర్చకు రాకుండా క్యాంప్ ఆఫీస్‌పై ధర్నా పేరుతో దాడికి ప్రయత్నించడం ఎంతవరకు సమంజసమని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ప్రశ్నించారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ నేను క్యాంప్ ఆఫీస్‌లో లేని సమయంలో, నా కుటుంబ సభ్యులు ఇంట్లో ఉన్నారని తెలిసి క్యాంప్ ఆఫీస్ వద్దకు వచ్చి ధర్నా పేరుతో దాడికి ప్రయత్నించడం అత్యంత దుర్మార్గమైన చర్య. నేను బహిరంగంగా అభివృద్ధిపై చర్చకు ఆహ్వానించాను. నిజంగా గతంలో అభివృద్ధి చేసి ఉంటే, ప్రజల ముందుకు వచ్చి ఆధారాలతో సమాధానం చెప్పాలి. పదేళ్ల పాలనలో అభివృద్ధి చేశామని చెప్పుకుంటున్న మీరు, ఉమ్మడి వరంగల్ జిల్లాలో పది అసెంబ్లీ స్థానాల్లో ఎందుకు ఓడిపోయారో ప్రజలకు వివరించాలి.అభివృద్ధిపై చర్చకు రావాలని పిలిస్తే, ప్రజలు తిరస్కరించిన మాజీ ఎమ్మెల్యేలు మధ్యలో జోక్యం చేసుకొని రాజీనామాలంటూ కొత్త నాటకాలకు తెరలేపుతున్నారు. అంబేద్కర్ చౌరస్తాకు రావాలని సవాల్ విసిరితే మా నాయకులు, కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. చర్చకు రావాల్సిన వారు మాత్రం సమాధానం చెప్పలేక వెనుదిరిగారు. గతంలో పదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనులు, ప్రస్తుతం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన జీవోలు, ఆధారాలతో మా నాయకులు చర్చకు వచ్చారు. సమాధానం చెప్పలేక పారిపోయిన వారు ఇప్పుడు క్యాంప్ ఆఫీస్ వద్దకు వచ్చి గొడవలు సృష్టించడం ఎందుకు? రాజకీయాల పేరుతో కబ్జాలు, దోపిడీలు, దౌర్జన్యాలకు పాల్పడటం కాకుండా ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టాలి. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు.పోలీసుల జోక్యం లేకపోయి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో ఆలోచించుకోవాలి. మరోసారి నా క్యాంప్ ఆఫీస్ జోలికి వస్తే సహించేది లేదు. ఈ విషయంలో చివరిసారిగా హెచ్చరిస్తున్నాను. కాంగ్రెస్ కార్యకర్తలకు ఎమ్మెల్యే విజ్ఞప్తి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరూ తొందరపడి ఎలాంటి చర్యలకు దిగవద్దు. సంయమనం పాటించాలి. ప్రజలే అన్నీ గమనిస్తున్నారు. వారి దుర్మార్గపు చర్యలకు ప్రజలే తగిన సమాధానం చెబుతారు. మనం అభివృద్ధి, ప్రజాసేవ లక్ష్యంగా ముందుకు సాగుదాం. అభివృద్ధిపై చర్చకు నేను ఎప్పుడూ సిద్ధమే. కానీ కుటుంబ సభ్యులు ఉన్న సమయంలో క్యాంప్ ఆఫీస్‌పై దాడులకు ప్రయత్నించడం, రాజకీయాల పేరుతో అల్లర్లు సృష్టించడం మాత్రం సహించేది లేదు. అని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గారు స్పష్టం చేశారు.

Views: 20

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

చౌటకూర్‌లో భక్తి పారవశ్యం.. 299 మంది భక్త బృందంతో 28,807 పార్థివ లింగాల తయారీ! చౌటకూర్‌లో భక్తి పారవశ్యం.. 299 మంది భక్త బృందంతో 28,807 పార్థివ లింగాల తయారీ!
చౌటకూర్, : మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని 2027 మార్చి 6వ తేదీన నిర్వహించనున్న దశకోటి పార్థివ లింగాల మహా సంకల్పంలో భాగంగా, సంగారెడ్డి జిల్లా చౌటకూర్...
గ్రామస్థాయి నుంచి బూత్ స్థాయి వరకు బీజేపీని బలోపేతం చేయాలి : మాజీ ఎంపీ సీతారాం నాయక్
అర్హులందరికీ చేయూత పింఛన్లు - కష్టాల్లో ఉన్న కుటుంబాలకు రూ.5 లక్షల బీమా భరోసా : మంత్రి సీతక్క
తండ రాధమ్మ కుటుంబాన్ని పరామర్శించిన లక్ష్మణ్ బాబు
శ్రీ వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్:
పల్స్ పోలియో కార్యక్రమంలో ప్రోటోకాల్ ఉల్లంఘించారని డిఎం హెచ్ ఓ కు ఫిర్యాదు
సాయిరెడ్డిగూడలో కొనసాగుతున్న ఇందిరమ్మ బీమా నమోదు ప్రక్రియ