తెలంగాణకి కరువు సహాయ ఆర్థిక ప్యాకేజ్ ప్రకటించాలి

తెలంగాణకి కరువు సహాయ ఆర్థిక ప్యాకేజ్ ప్రకటించాలి

  హనుమకొండ న్యూస్ ; ఎల్ నినో ప్రభావం వలన దేశంలోనే ఎక్కువగా ప్రభావితమై తీవ్ర కరువు పరిస్థితులను ఎదుర్కొంటున్న తెలంగాణ రాష్ట్రానికి డిజాస్టర్ మేనేజ్ మెంట్ చర్యలలో భాగంగా ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించి ఆదుకోవాలని ప్రజా వేదిక రాష్ట్ర చైర్మన్ డాక్టర్ తిరునహరి శేషు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ ద్వారా విజ్ఞప్తి చేసినారు.ఎల్ నినో ప్రభావం వలన ఖరీఫ్ లో పది లక్షల ఎకరాలలో పంట నష్టం, 14 లక్షల ఎకరాలలో పంట విస్తీర్ణం తగ్గిపోవడం, రబీ సీజన్ లో 64 లక్షల ఎకరాలలో క్రాప్ హాలిడే ప్రకటించడం సాగునీరు లేక రైతులు, కౌలుదారులు, వ్యవసాయ కూలీలు త్రాగునీరు లేక సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి 70 లక్షల రైతులను 22 లక్షల కౌలు రైతులను 59 లక్షల వ్యవసాయ కూలీలను ఆదుకోటానికి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ తో పాటు ఉపాధి హామీ పనులను 200 మ్యాన్ డేస్ పెంచి ఆదుకోవాలని ప్రధానమంత్రి కి విజ్ఞప్తి చేసినారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా 30 వేల కోట్ల ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేసింది కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని కరువు కోరల నుండి కాపాడటానికి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని విజ్ఞప్తి చేసినారు.

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

చౌటకూర్‌లో భక్తి పారవశ్యం.. 299 మంది భక్త బృందంతో 28,807 పార్థివ లింగాల తయారీ! చౌటకూర్‌లో భక్తి పారవశ్యం.. 299 మంది భక్త బృందంతో 28,807 పార్థివ లింగాల తయారీ!
చౌటకూర్, : మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని 2027 మార్చి 6వ తేదీన నిర్వహించనున్న దశకోటి పార్థివ లింగాల మహా సంకల్పంలో భాగంగా, సంగారెడ్డి జిల్లా చౌటకూర్...
గ్రామస్థాయి నుంచి బూత్ స్థాయి వరకు బీజేపీని బలోపేతం చేయాలి : మాజీ ఎంపీ సీతారాం నాయక్
అర్హులందరికీ చేయూత పింఛన్లు - కష్టాల్లో ఉన్న కుటుంబాలకు రూ.5 లక్షల బీమా భరోసా : మంత్రి సీతక్క
తండ రాధమ్మ కుటుంబాన్ని పరామర్శించిన లక్ష్మణ్ బాబు
శ్రీ వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్:
పల్స్ పోలియో కార్యక్రమంలో ప్రోటోకాల్ ఉల్లంఘించారని డిఎం హెచ్ ఓ కు ఫిర్యాదు
సాయిరెడ్డిగూడలో కొనసాగుతున్న ఇందిరమ్మ బీమా నమోదు ప్రక్రియ