ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేసిన సర్పంచ్ ఇందిరా రాములు

ఇందిరమ్మ ఇళ్లతో పేదల కల సాకారం - కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మిద్దె రాములు గుడిసె లేని గ్రామమే మా ప్రభుత్వ లక్ష్యం - డిప్యూటీ సర్పంచ్ గడ్డమీది మహేష్ యాదవ్

ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేసిన సర్పంచ్ ఇందిరా రాములు

బిజినపల్లి (నాగర్ కర్నూల్), :  బిజినపల్లి మండల కేంద్రంలో ఇందిరమ్మ నూతన ఇంటి నిర్మాణ పూజా కార్యక్రమం ఘనంగా జరిగింది. మండల కేంద్రానికి చెందిన కరిగల్ల పద్మ నూతన ఇంటి నిర్మాణానికి గ్రామ సర్పంచ్ మిద్దె ఇందిరా రాములు గారు భూమి పూజ చేశారు.ఈ సందర్భంగా డిప్యూటీ సర్పంచ్ గడ్డమీది మహేష్ యాదవ్ గారు మాట్లాడుతూ గుడిసె లేని గ్రామమే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. లబ్ధిదారు కుటుంబానికి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా సర్పంచ్ మిద్దె ఇందిరా రాములు గారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా నిరుపేదల సొంత ఇంటి కల సాకారం అవుతుందని అన్నారు. పేద కుటుంబాలకు పక్కా ఇళ్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు అందేలా కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మిద్దె రాములు గారు, ఉప సర్పంచ్ గడ్డమీది మహేష్ గారు, ఎంపీడీవో కథలప్ప గారు, గ్రామ సెక్రెటరీ శివ గారు, సోషల్ మీడియా ఇంచార్జ్ మిద్దె సూరి గారు, మిద్దె కురుమయ్య గారు, మిద్దె పర్వతాలు గారు, లబ్ధిదారు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Views: 54

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

చౌటకూర్‌లో భక్తి పారవశ్యం.. 299 మంది భక్త బృందంతో 28,807 పార్థివ లింగాల తయారీ! చౌటకూర్‌లో భక్తి పారవశ్యం.. 299 మంది భక్త బృందంతో 28,807 పార్థివ లింగాల తయారీ!
చౌటకూర్, : మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని 2027 మార్చి 6వ తేదీన నిర్వహించనున్న దశకోటి పార్థివ లింగాల మహా సంకల్పంలో భాగంగా, సంగారెడ్డి జిల్లా చౌటకూర్...
గ్రామస్థాయి నుంచి బూత్ స్థాయి వరకు బీజేపీని బలోపేతం చేయాలి : మాజీ ఎంపీ సీతారాం నాయక్
అర్హులందరికీ చేయూత పింఛన్లు - కష్టాల్లో ఉన్న కుటుంబాలకు రూ.5 లక్షల బీమా భరోసా : మంత్రి సీతక్క
తండ రాధమ్మ కుటుంబాన్ని పరామర్శించిన లక్ష్మణ్ బాబు
శ్రీ వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్:
పల్స్ పోలియో కార్యక్రమంలో ప్రోటోకాల్ ఉల్లంఘించారని డిఎం హెచ్ ఓ కు ఫిర్యాదు
సాయిరెడ్డిగూడలో కొనసాగుతున్న ఇందిరమ్మ బీమా నమోదు ప్రక్రియ