సీనియర్ జర్నలిస్ట్ షేక్ ఫరీద్ అహ్మద్‌కు రాష్ట్రస్థాయి ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు

సీనియర్ జర్నలిస్ట్ షేక్ ఫరీద్ అహ్మద్‌కు రాష్ట్రస్థాయి ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు

నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ షేక్ ఫరీద్ అహ్మద్‌కు రాష్ట్రస్థాయి ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు దక్కింది. హైదరాబాద్‌లోని వేట్స్ గార్డెన్‌లో తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో నాంపల్లి ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ చేతుల మీదుగా ఆయన అవార్డు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు.మూడు దశాబ్దాలుగా ఉర్దూ పత్రికా రంగంలో విశేష సేవలందించినందుకు ఫరీద్ అహ్మద్ అవార్డుకు ఎంపికయ్యారు. ఆయన రాష్ట్రీయ సహారా, అహం ఇతల్లా తదితర ఉర్దూ దినపత్రికల్లో జర్నలిస్టుగా సేవలు అందించారు. ఉర్దూ పత్రికారంగ అభివృద్ధికి కృషి చేస్తున్న తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్‌కు ప్రముఖులు అభినందనలు తెలిపారు. జిల్లా జర్నలిస్టుకు రాష్ట్రస్థాయి అవార్డు దక్కడంపై తోటి జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేశారు. అవార్డు అందించిన యూనియన్ రాష్ట్ర కమిటీకి షేక్ ఫరీద్ అహ్మద్ కృతజ్ఞతలు తెలిపారు.

Views: 36

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

మల్హర్‌రావు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎం ఎస్ ఎఫ్ నూతన కమిటీ ఎన్నిక మల్హర్‌రావు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎం ఎస్ ఎఫ్ నూతన కమిటీ ఎన్నిక
మల్హర్‌ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్‌రావు మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎమ్మార్పీఎస్ జిల్లా కో-ఇంచార్జి కేసారపు నరేష్, ఎమ్మార్పీఎస్ మల్హర్ మండల అధ్యక్షుడు ఇందారపు...
15 నెలలుగా పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు చెల్లించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి రాసూరి యుగేందర్
పశువుల ఆరోగ్య పరిరక్షణకు ఉచిత వెటర్నరీ వైద్య శిబిరం
ఘనంగా మండల అంతర్ పాఠశాల క్రీడోత్సవాలు
అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత - ఆదిలాబాద్ లో ఘనంగా పెన్షన్ల పంపిణీ.
డాక్టర్ బదిలీతో చీకోడ్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరంలో వైద్య సేవలకు బ్రేక్!
కంజర్ గ్రామ శివారులో బుధవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది.