జోగిపేటలో ఎస్సీ బాలికల హాస్టల్ లో భోజనం వికటించి విద్యార్థినిలకు తీవ్ర అస్వస్థత

నలుగురు విద్యార్థినులకు వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థత** *హాస్టల్ లో పురుగుల అన్నం పెడుతున్నారంటూ విద్యార్థినుల ఆవేదన*

జోగిపేటలో ఎస్సీ బాలికల హాస్టల్ లో భోజనం వికటించి విద్యార్థినిలకు తీవ్ర అస్వస్థత

అందోల్, : సంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది.సాక్షాత్తూ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఇలాకాలోనే విద్యార్థినులకు రక్షణ కరువైంది.సంగారెడ్డి జిల్లా జోగిపేటలో బుధవారం ఎస్సీ బాలికల వసతి గృహంలో పురుగుల అన్నం తిని పలువురు విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.భోజనం వికటించి విద్యార్థినిలకు తీవ్ర అస్వస్థత కారణంగా వాంతులు, కడుపునొప్పితో విలవిలలాడుతూ ఆసుపత్రి పాలయ్యారు.ఇంత జరుగుతున్నా హాస్టల్ నిర్వాహకులు మాత్రం నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారని విద్యార్థినులు కన్నీటిపర్యంతమవుతున్నారు. సంగారెడ్డి జిల్లా జోగిపేటలోని ఎస్సీ బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది.హాస్టల్‌లో పెట్టిన పురుగుల అన్నం తిన్న విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.ఉదయం భోజనం చేసిన తర్వాత జోగిపేట జూనియర్ కళాశాలకు వెళ్లిన విద్యార్థినులకు ఒక్కసారిగా కడుపునొప్పి,విపరీతంగా వాంతులు మొదలయ్యాయి. అస్వస్థతకు గురైన బైపీసీ సెకండియర్ విద్యార్థిని శాశ్విత, బీఈసీ విద్యార్థిని స్వప్న, అలాగే సీఈసీ ఫస్టియర్ విద్యార్థినులు నవీన, దీపిక, శైలజ, జ్ఞానేశ్వరి, గాయత్రిలను హుటాహుటిన జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ప్రస్తుతం ఆసుపత్రి సూపరింటెండెంట్ సౌజన్య ఆధ్వర్యంలో వైద్య బృందం వారికి చికిత్స అందిస్తోంది. విషయం తెలుసుకున్న ఆర్డీఓ శ్రీనివాస్, ఎమ్మార్వో మధుకర్ రెడ్డి,మున్సిపల్ కమిషనర్ తిరుపతి,ఎస్సై గిరి శ్రీకాంత్ ఆసుపత్రికి చేరుకుని విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.అధికారులను చూడగానే బాధిత విద్యార్థినులు కంటతడి పెట్టారు.గత కొన్ని రోజులుగా హాస్టల్‌లో పురుగుల అన్నమే పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.అన్నంలో పురుగులు వస్తున్నాయి, కడుపునొప్పి వస్తోందని వార్డెన్ సబిత, వంటమనిషి అనురాధ దృష్టికి తీసుకెళ్తే... "ఇలానే ఉంటుంది,ఎలా వండితే అలానే సర్దుకుని తినాలి, లేదంటే హాస్టల్ నుండి వెళ్ళిపోవాలి" అంటూ బెదిరిస్తున్నారని విద్యార్థినులు భయపడుతూ అధికారుల ముందు తమ గోడు వెళ్లబోసుకున్నారు.రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే విద్యార్థినుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నా పట్టించుకునే నాథుడే లేడని తల్లిదండ్రులు,విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి హాస్టల్‌పై తనిఖీలు నిర్వహించాలని,నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుని విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని డిమాండ్ చేస్తున్నారు.

Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

తండ రాధమ్మ కుటుంబాన్ని పరామర్శించిన లక్ష్మణ్ బాబు తండ రాధమ్మ కుటుంబాన్ని పరామర్శించిన లక్ష్మణ్ బాబు
వెంకటాపూర్, : లక్ష్మీదేవిపేట గ్రామానికి చెందిన తండ రమేష్, తండ యాదగిరి, తండ శ్రీనివాస్ తల్లి తండ రాధమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. బుధవారం బీఆర్ఎస్...
శ్రీ వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్:
పల్స్ పోలియో కార్యక్రమంలో ప్రోటోకాల్ ఉల్లంఘించారని డిఎం హెచ్ ఓ కు ఫిర్యాదు
సాయిరెడ్డిగూడలో కొనసాగుతున్న ఇందిరమ్మ బీమా నమోదు ప్రక్రియ
మిడ్జిల్ సింగిల్ విండో చైర్మన్ పదవి మైనార్టీ యువతకు కేటాయించాలి
చౌటకూర్‌లో భక్తి పారవశ్యం.. 299 మంది భక్త బృందంతో 28,807 పార్థివ లింగాల తయారీ!
జోగిపేటలో ఎస్సీ బాలికల హాస్టల్ లో భోజనం వికటించి విద్యార్థినిలకు తీవ్ర అస్వస్థత