సాలూర ఉన్నత పాఠశాలకు ఐదు అదనపు తరగతి గదులు మంజూరు

ప్లే గ్రౌండ్, ప్రహరీ గోడ నిర్మాణాలకు నిధులు.. విద్యార్థుల హాజరుపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశం

సాలూర ఉన్నత పాఠశాలకు ఐదు అదనపు తరగతి గదులు మంజూరు

సాలూర : సాలూర మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణ, తరగతి గదులు, విద్యార్థులకు కల్పిస్తున్న మౌలిక వసతులను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎఫ్‌ఆర్‌ఎస్ విధానం ద్వారా విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు నమోదును తనిఖీ చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నారా లేదా అని ఆరా తీశారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తరగతి గదులు సరిపోవడం లేదని, విద్యార్థులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రాజీ మంజుశ్రీ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన కలెక్టర్ పాఠశాలకు ఐదు అదనపు తరగతి గదులను మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే విద్యార్థులకు క్రీడా సదుపాయాలు కల్పించేందుకు ప్లే గ్రౌండ్, పాఠశాల భద్రత కోసం ప్రహరీ గోడ నిర్మాణానికి కూడా నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఉన్నత పాఠశాలకు ఆనుకుని ఉన్న ఉర్దూ మీడియం పాఠశాలను కూడా దృష్టిలో ఉంచుకుని విద్యార్థులందరికీ ఉపయోగపడే విధంగా ఆటస్థలం ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వచ్చే విద్యా సంవత్సరంలో పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగేలా ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేయాలని సూచించారు. ఉపాధ్యాయులందరూ తప్పనిసరిగా సమయపాలన పాటిస్తూ విధులకు హాజరుకావాలని, ఎలాంటి అనుమతి లేకుండా విధులకు గైర్హాజరయ్యే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అవసరమైన సందర్భాల్లో నేరుగా సస్పెన్షన్ వేటు వేస్తామని హెచ్చరించారు. అదేవిధంగా విద్యార్థుల హాజరు శాతం నూటికి నూరు శాతం ఉండేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎక్కువ రోజుల పాటు పాఠశాలకు గైర్హాజరవుతున్న విద్యార్థులను గుర్తించి, వారు బడికి ఎందుకు రావడం లేదో క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ప్రతి విద్యార్థికి ఆధార్ సీడింగ్ ప్రక్రియను తప్పనిసరిగా పూర్తి చేయాలని ఆదేశించారు. విద్యార్థులకు అవసరమైన అన్ని మౌలిక వసతులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అనంతరం కలెక్టర్ ఎనిమిదో తరగతి గదిని సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. గణిత సబ్జెక్టుకు సంబంధించిన ప్రశ్నలు అడిగి వారి విద్యా సామర్థ్యాన్ని పరీక్షించారు. విద్యార్థులు చక్కగా సమాధానాలు చెప్పడంతో వారిని అభినందించి బహుమతులు, చాక్లెట్లు అందజేశారు. ప్రభుత్వం పాఠశాల అభివృద్ధికి అవసరమైన వసతులు కల్పిస్తుందని, విద్యార్థులు వాటిని సద్వినియోగం చేసుకుంటూ క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని కలెక్టర్ సూచించారు. ఈ తనిఖీలో ఇన్‌చార్జి జిల్లా విద్యాశాఖ అధికారి సాయాగౌడ్, తహసీల్దార్ ఎం.ఏ. నవాజ్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రాజీ మంజుశ్రీ, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Views: 183

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పల్స్ పోలియో కార్యక్రమంలో ప్రోటోకాల్ ఉల్లంఘించారని డిఎం హెచ్ ఓ కు ఫిర్యాదు పల్స్ పోలియో కార్యక్రమంలో ప్రోటోకాల్ ఉల్లంఘించారని డిఎం హెచ్ ఓ కు ఫిర్యాదు
అందోల్,: సంగారెడ్డి జిల్లా అందోలు-జోగిపేట మున్సిపాలిటీ పల్స్ పోలియో కార్యక్రమంలో ప్రోటోకాల్ ఉల్లంఘించారని ఆరోపిస్తూ బాధ్యులపై చర్యలు కోరుతూ సంగారెడ్డి డిఎం హెచ్ ఓ కు కాంగ్రెస్...
సాయిరెడ్డిగూడలో కొనసాగుతున్న ఇందిరమ్మ బీమా నమోదు ప్రక్రియ
మిడ్జిల్ సింగిల్ విండో చైర్మన్ పదవి మైనార్టీ యువతకు కేటాయించాలి
చౌటకూర్‌లో భక్తి పారవశ్యం.. 299 మంది భక్త బృందంతో 28,807 పార్థివ లింగాల తయారీ!
జోగిపేటలో ఎస్సీ బాలికల హాస్టల్ లో భోజనం వికటించి విద్యార్థినిలకు తీవ్ర అస్వస్థత
అగ్రిగోల్డ్ డిపాజిటర్లు, బాధితులు మరియు ఏజెంట్లకు ముఖ్య గమనిక
ఎన్‌హెచ్‌ఎం పోస్టుల ప్రొవిజనల్ జాబితా విడుదల