సాయిరెడ్డిగూడలో కొనసాగుతున్న ఇందిరమ్మ బీమా నమోదు ప్రక్రియ

అర్హులైన ప్రతి ఒక్కరూ ఇందిరమ్మ బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి

సాయిరెడ్డిగూడలో కొనసాగుతున్న ఇందిరమ్మ బీమా నమోదు ప్రక్రియ

కందుకూరు న్యూస్ :  కందుకూరు మండలం సాయిరెడ్డిగూడ గ్రామ పంచాయతీలో ఇందిరమ్మ బీమా పథకానికి సంబంధించిన నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. గ్రామంలోని అర్హులైన కుటుంబాలకు ప్రభుత్వ పథకం ద్వారా ప్రయోజనం చేకూర్చే లక్ష్యంతో పంచాయతీ కార్యాలయంలో నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ కొంగళ్ల అనిత, ఉపసర్పంచ్ సకీలాల శ్రీను పర్యవేక్షిస్తుండగా, పంచాయతీ కార్యదర్శి తిరుపతి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామ ప్రజలకు పథకానికి సంబంధించిన వివరాలను తెలియజేస్తూ, అర్హులైన వారు నమోదు ప్రక్రియను సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా గ్రామ పంచాయతీ పాలకవర్గం, అధికారులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Views: 3

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

తండ రాధమ్మ కుటుంబాన్ని పరామర్శించిన లక్ష్మణ్ బాబు తండ రాధమ్మ కుటుంబాన్ని పరామర్శించిన లక్ష్మణ్ బాబు
వెంకటాపూర్, : లక్ష్మీదేవిపేట గ్రామానికి చెందిన తండ రమేష్, తండ యాదగిరి, తండ శ్రీనివాస్ తల్లి తండ రాధమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. బుధవారం బీఆర్ఎస్...
శ్రీ వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్:
పల్స్ పోలియో కార్యక్రమంలో ప్రోటోకాల్ ఉల్లంఘించారని డిఎం హెచ్ ఓ కు ఫిర్యాదు
సాయిరెడ్డిగూడలో కొనసాగుతున్న ఇందిరమ్మ బీమా నమోదు ప్రక్రియ
మిడ్జిల్ సింగిల్ విండో చైర్మన్ పదవి మైనార్టీ యువతకు కేటాయించాలి
చౌటకూర్‌లో భక్తి పారవశ్యం.. 299 మంది భక్త బృందంతో 28,807 పార్థివ లింగాల తయారీ!
జోగిపేటలో ఎస్సీ బాలికల హాస్టల్ లో భోజనం వికటించి విద్యార్థినిలకు తీవ్ర అస్వస్థత