చౌటకూర్‌లో వైభవంగా ఆధ్యాత్మిక వేడుకలు..
91 మంది దంపతులతో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం
చౌటకూర్: సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల కేంద్రంలోని శ్రీ శ్రీ శ్రీ అన్నపూర్ణ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో ఆధ్యాత్మిక వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో 91 మంది దంపతులు సామూహికంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించారు.ఈ కార్యక్రమంలో దంపతులు సంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణలు, భక్తుల నామస్మరణతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది.సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతంలో 91 మంది దంపతులు ఒకేసారి పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నారు. భక్తుల రాకతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది.భక్తిభావంతో నిర్వహించిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం చౌటకూర్ గ్రామంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


